21.6.13

చెగోడీలు

చెగోడీలు

కావలసిన పదార్థాలు
వరిపిండి -- 4 కప్పులు
నీళ్ళు -- 4 కప్పులు
ఉప్పు --తగినంత
కారం -- 3 స్పూన్స్
జీలకర్ర -- 1 స్పూన్
పెసరపప్పు -- 1/4 కప్పు
ఇంగువ -- కొంచెం
నూనె -- 1/2 కేజీ

తయారీవిధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో నీరు పోసి, నీటిలో పెసరపప్పు, ఉప్పు, కారం, జీలకర్ర & ఇంగువ వేసి నీటిని బాగా మరిగించాలి.... మరిగిన తరవాత వరిపిండిని ఆ నీటిలో వేస్తూ ఉండకట్టకుండా కొంచెం నూనె వేసి కలిపి ముతపెట్టుకోవాలి. పిండి చల్లారిన తరవాత ఒక పీట తీసుకుని, పీట మీద కొంచెం నూనె రాసి, పిండి వేసి బాగా మదాయించాలి. పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని చేగోడీలు చేసుకోవాలి. అన్నీ తయారయ్యాక..... స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి కాగాక చేగోడీలు కొన్ని కొన్ని వేస్తూ దోరగా వేయించి తీసుకోవాలి. అంతే కరకరలాడే కమ్మని చేగోడీలు రెడీ.....



No comments:

Post a Comment