21.6.13

చక్కెర పొంగలి

చక్కెర పొంగలి:--

కావలసిన పదార్థాలు:--
బియ్యం -- 2 కప్పులు
వేయించిన పెసరపప్పు -- 1/2 కప్పు
బెల్లంకోరు -- 4 కప్పులు
నెయ్యి -- 1కప్పు
ఏలకుల పొడి -- 1 స్పూన్
జీడిపప్పు -- 50 గ్రాములు
కిస్ మిస్ -- 25 గ్రాములు

తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బియ్యం, పెసరపప్పు కలిపి కుక్కర్ లో మెత్తగా ఉడికించి, పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో బెల్లం వేసి మెత్తగా గరిటతో కలుపుతూ స్టవ్ మీద సన్నని మంటపై, ఉడికించితే, బెల్లం అంతా కరిగి మెత్తగా పాకంలాగా వస్తుంది. ఇది ఉడికే లోపున....వేరే స్టవ్ మీద చిన్న పాత్రలో నెయ్యి వేసి, వేడిచేసి అందులో జీడిపప్పు, కిస్ మిస్ లు దోరగా వేయించి, చక్కర పొంగలిలో వేసి, ఏలకుల పొడి వేసి కలిపి దగ్గరగా అయిన తరవాత, దించుకోవటమే. అంతే ఎంతో రుచికరమైన తియ్యని చక్కెర పొంగలి రెడీ.No comments:

Post a Comment