Showing posts with label మసాలా కుర్మ కూరలు. Show all posts
Showing posts with label మసాలా కుర్మ కూరలు. Show all posts

30.4.13

పనసకాయ కుర్మ కూర

పనసకాయ కుర్మ కూర
కావలసిన పదార్థాలు
పనసకాయ కుర్మాముక్కలు--1/2
(కూరకి తగినట్లుగా ముక్కలు మార్కెట్లో అమ్ముతారు) 
చింతపండు-పెద్ద నిమ్మకాయంత
ఉప్పు -రుచికి సరిపడినంత
పసుపు -చిటికెడు
అల్లం&వెల్లుల్లి పేస్ట్ -2 స్పూన్స్
ఉల్లిముద్ద -1 కప్
తరిగిన ఉల్లిపాయల ముక్కలు-1 కప్
గరం మసాలా పొడి- 2 స్పూన్స్
పొడి కారం -2స్పూన్స్
జీడిపప్పు -50గ్రాములు
కొత్తిమీర -కొంచంగా
నూనె -150గ్రాములు

తయారుచేసే విధానం
ముందుగ స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పనసకాయ ముక్కల్ని చింతపండు రసం,ఉప్పు,పసుపు వేసి 20 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి జీడిపప్పు ఉల్లిముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు & ఉల్లిముద్ద వేసి పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేయించాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న పనస కుర్మ ముక్కల్ని వేసి గరం మసాల పొడి & కారం పొడి వేసి, ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.ఎంతవరకు అంటే నీరు అంతా పోయి నూనె పైకి తేలేంతవరకు.అంతే ఇప్పుడు తయారైన కూరని ఒక డిష్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే......అంతే ఘుమఘుమలాడే పనస కుర్మా కూర రెడీ.......