Showing posts with label కాకరకాయ కూరలు---రకాలు. Show all posts
Showing posts with label కాకరకాయ కూరలు---రకాలు. Show all posts

30.4.13

కాకరకాయ ఉల్లి ముద్ద కూర

కాకరకాయ ఉల్లి ముద్ద కూర
కావలసిన పదార్థాలు
కాకరకాయలు 1/2 కేజీ 
ఉల్లిపాయలు 1/4
పొడికారం 4 స్పూన్స్
ఉప్పు- రుచికి సరిపడినంత
ధనియాలపొడి -1 స్పూన్
అల్లం & వెల్లుల్లి పేస్టు- 1 స్పూన్
జీలకర్ర పొడి- 1/2 స్పూన్
నూనె- 150 గ్రా
(ఉల్లి పాయలు అన్ని పొట్టు తీసి ముక్కలుగా కోసి ముద్ద రుబ్బి ఉంచుకోవాలి)

తయారు చేయు విధానము
కాకరకాయలని శుభ్రంగా కడిగి, కాయని 4 చీలికలుగా, గుత్తుగ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసిచీల్చిన కాకరకాయల ముక్కల్ని,కొద్ది -కొద్దిగా వేస్తూ సన్నని మంట మీద గోధుమ రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి...అన్ని వేయించి తీసాక....బాణలిలో ఉన్న నూనెలో ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఉల్లిముద్దని వేసి అది వేగిన తరవాత , ధనియాలపొడి...జీలకర్రపొడి & అల్లం వెల్లుల్లి పేస్టువేసి బాగా వేయించాలి..... ఉల్లిముద్ద కమ్మని వాసన వచ్చే వరకు వేయించి అప్పుడు పక్కనే ఉంచిన కాకరకాయల ముక్కల్ని వేసి, ఒక గ్లాసుడు నీరు పోసి బాగా మగ్గించాలి.....ఇప్పుడు స్టవ్ని పెద్ద సెగమీద పెట్టాలి... నీరు అంతా పోయి నూనె పైకి తేలేంతవరకు వేయించాలి.....అంతే వేడి-- వేడి కాకరకాయ ఉల్లి ముద్ద కూర రెడీ .......



11.2.13

కాకరకాయ పులుసు బెల్లం కూర





తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:-

1/4 కిలో కాకరకాయలు 
చిన్న నిమ్మకాయంత చింతపండు 
రుచికి సరిపడా ఉప్పు
పెద్ద స్పూన్ పొడి కారం
చిటికెడు పసుపు
చిన్న బెల్లం ముక్క
నూనె
పోపు దినుసులు
కరివేపాకు

తయారుచేయు విధానం:-


ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి, చక్రాలుగా తరిగి, స్టవ్ వెలిగించి, బాణలిలో వేసి, ఆ ముక్కలలో చింతపండు రసం వేసి చిటెకెడు పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలి పెట్టుకుని, నూనె వేసి,పోపుకు సరిపడా మినప్పప్పు, 5 ఎండుమిరపకాయలు,కొద్దిగా ఆవాలు,
వేసి వేగాక, ఉడికించి పక్కన పెట్టుకున్న కాకర చక్రాలను పోపులో వెయ్యాలి.కాకర ముక్కల్ని కదుపుతూ ముందుగ తురిమి ఉంచుకున్న బెల్లం తురుము,పోడికారము వేసి కదుపుతూ 5 నిమిషాలు ఉంచి దించెయ్యాలి.అంతే కాకరకాయ పులుసు బెల్లం కూర రెడీ......