కందిపొడి
కావలసిన సామగ్రి:-
1 గ్లాసు కందిపప్పు
1 గ్లాసు శెనగపప్పు
1/2 గ్లాసు పెసరపప్పు
20 ఎండుమిరపకాయలు
ఉప్పు 3 చెమ్చాలు(తగినంత)
1 చెమ్చా జీలకర్ర
10 వెల్లుల్లి రేకులు
ఇంగువ కొంచెం
తయారుచేయు విధానం:-
పప్పులు విడివిడిగా నూనె వెయ్యకుండా బాణలిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా పప్పుల్లో వేసి కదిపితే ఆ వేడికి మిర్చి పచిదనం పోతుంది. పప్పులు అన్ని చల్లారిన తరవాత మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఆఖరి నిమిషం లో జీలకర్ర,ఇంగువ,వెల్లుల్లి,ఉప్పు వేసి మరొక్కసారి తిప్పాలి.అంతే కమ్మ కమ్మని కంది పొడి రెడీ......
కావలసిన సామగ్రి:-
1 గ్లాసు పెసరపప్పు
6 ఎండుమిరపకాయలు
4 వెల్లుల్లి రేకులు
కొంచం జీలకర్ర
తగినంత ఉప్పు
తయారుచేయు విధానం:-
పెసరపప్పును బాగా ఎండబెట్టి, ఎందలోనుండి తీసి, వేడిగా ఉన్నప్పుడే మిక్సీ చెయ్యాలి.చివరగా జేలకర్ర,ఉప్పు,ఇంగువ,ఎండుమిర్చి,వెల్లుల్లి వేసి తిప్పాలి.అంతే కమ్మకమ్మని పెసరపొడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని తినేయ్యటమే....
కావలసిన సామగ్రి:-
1 గ్లాసు నువ్వులపప్పు
10 ఎండుమిరపకాయలు
6 వెల్లుల్లి రేకులు
జీలకర్ర కొంచెంగా
తగినంత ఉప్పు
తయారుచేయు విధానం:-
ముందుగా స్టవ్ వెలిగించి బాణలిపెట్టి, నునె వెయ్యకుండా నువ్వులపప్పుని కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి. చల్లారిన తరవాత మిక్సీలో వేసి పొడి చెయ్యాలి. ఆఖరి నిమిషంలో జేలకర్ర,వెల్లుల్లి,ఎండుమిర్చి,ఉప్పు వేసి మరొక్కసారి మెత్తగా చెయ్యాలి.అంతే కమ్మని నువ్వులపొడి రెడీ.వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది.....
కావలసిన సామగ్రి:-
1 గ్లాస్ కందిపప్పు
1 గ్లాస్ ధనియాలు
1/2 గ్లాస్ మిరియాలు
1/4 గ్లాస్ జీలకర్ర
10 ఎండుమిరపకాయలు
తయారుచేయు విధానం:-
అన్ని సామాన్లు కలిపి ఒక పళ్ళెంలో పోసి,ఒకరోజంతా ఎండలో పెట్టి,తీసాక వేడి ఉండగానే, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.(ఎండలోపెట్టుకోవటానికి అవకాశము లేనివారు చారుపొడి సమాన్లుని స్టవ్ పైన బాణలిలో వేడిచేసుకొని ఆ వేడి మీదే మిక్సీ చేసుకోవాలి).......అంతే చారుపొడి సిద్దమే...
కావలసిన సామగ్రి:-
1 గ్లాస్ సెనగపప్పు
1 గ్లాస్ మినప్పప్పు
1/4 గ్లాస్ ధనియాలు
2 స్పూన్స్ మెంతులు
1 స్పూన్ జీలకర్ర
25 ఎండుమిరపకాయలు
తయారుచేయు విధానం:-
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, ఒకొక్క సామానుని వేటికవి దోరగా వేయించి(మాడిపోకుండా) చల్లారిన తరవాత అన్ని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి....అంతే మెంతిపొడి రెడీ..........ఈ పొడిని కొన్ని రకాల పులుసు పెట్టిన కూరలలో వేసుకోవచ్చును.......సాంబారు & ముక్కల పులుసులలో కూడా ఈ పొడిని వేసుకోవచ్చును....
కావలసిన సామగ్రి:-
1 గ్లాస్ పుట్నాలపప్పు(చెట్నిపప్పు )
1 గ్లాస్ సెనగపప్పు
1 గ్లాస్ వేరుసెనగ గుళ్ళు(పప్పు)
20 ఎండుమిరపకాయలు
10 వెల్లుల్లి రేకులు
1 స్పూన్ జీలకర్ర
తయారుచేయు విధానం:-
ముందుగ స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేటికవి విడివిడిగా దోరగా వేయించి పెట్టుకోవాలి..చల్లారిన తరవాత అన్ని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి......అంతే కమ్మని కూరపొడి రెడీ......ఈ పొడిని అన్ని రకాలైన వేపుడు కూరలలో వేసుకోవచ్చును...చాలా రుచికరంగా ఉంటుంది....