సొజ్జి బూర్లు:-
కావలసిన పదార్థాలు:-
గోధుమ(బొంబాయి)రవ్వ --2 కప్పులు
పంచదార -- 2 కప్పులు
యాలకపొడి -- 1 స్పూన్
తోపు పిండి(1 కప్పు మినప్పప్పు , 3 కప్పులు బియ్యం---3 గంటల ముందుగా నానబెట్టి రుబ్బి ఉంచుకోవాలి)
నూనె -- 1/2 కేజీ
తయారివిధానము:--
ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి గిన్నె పెట్టి, 4 1/2 కప్పుల నీరు పోసి, మరిగించాలి. బాగా మసిలిన తరవాత రవ్వ, పంచదార & యాలకపొడి అన్ని వేసి ఉండకట్టకుండా కలుపుకోవాలి, కొంచెం నూనె వేసి కలిపితే ఉండకట్టకుండా ఉంటుంది. ఇప్పుడు గట్టిపడినతరవాత దించి, ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసి ఆరబెట్టాలి. చల్లారిన తరవాత చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె పోసి కాగాక, ముందుగా రుబ్బి ఉంచుకున్న తోపు పిండిలో ఒక్కొక్క రవ్వ ఉండని ముంచి నూనె లో వేసి, గోధుమ రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి...అంతే నోరూరించే సొజ్జి బూర్లు రెడీ......ఇవి రెండు మూడు రోజుల వరకు ఉంటాయి.
No comments:
Post a Comment