బీట్రూట్ బొబ్బోట్లు
కావలసిన పదార్థాలు
బీట్రూట్ --1/4 కేజీ
మైదాపిండి -- 1/4 కేజీ
పంచదార --1/4 కేజీ
నెయ్యి --50 గ్రా
యాలకులపొడి --1 స్పూన్
తయారివిధానం
బొబ్బట్లు చేసుకునే ఒక గంట ముందుగా, మైదాపిండిని పూరి పిండిలాగా మెత్తగా నీటితొ పాటు, నూనె వేసి కలిపి పైన తడి గుడ్డ వేసి మూత పెట్టి ఉంచుకోవాలి. ముందుగా బీట్రూటు ని చెక్కు తీసి, కోరు చేసుకుని ఉంచుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, ఒక స్పూన్ నెయ్యివేసి బీట్రూట్ కోరు, పంచదార యాలకల పొడి వేసి కమ్మగా, గట్టిపడే వరకు వేయించి పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తరవాత ఉండలు చుట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న మైదాపిండిని, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీలు లాగా ఒత్తుకుని మధ్యలో బీట్రూట్ ఉండలని ఉంచి చుట్టూ మూసి, మళ్ళి పూరీలుగా ఒక ఆకు పైన చేతితో వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి సన్నని మంటపై బొబ్బట్లని కాల్చుకోవాలి. అంతేవేడి -వేడి బొబ్బట్లు రెడీ. ఇవి ఒక వారంరోజుల వరకు నిల్వ ఉంటాయి. చిన్న- పెద్ద అందరు ఇష్టంగా తింటారు.
No comments:
Post a Comment