వంకాయ నువ్వుపిండి కూర
కావలసిన పదార్థాలు
చిన్ని వంకాయలు --1/2 కేజీ
నూలుపొడి --2 కప్పులు
ధనియాలపొడి --1 స్పూన్
జేలకర్రపొడి --1 స్పూన్
తరిగిన ఉల్లిపాయ ముక్కలు --1
కప్పు
తరిగిన టమాటా ముక్కలు --1
కప్పు
పొడికారం --4 స్పూన్స్
ఉప్పు & నూనె --తగినంత
తయారివిధానం
ముందుగా వంకాయలని 4
చిలికలుగా చేసుకుని నీటిలో వేసుకోవాలి. నూలుపొడిని మిక్సీలో వేసి రుబ్బుకొని
ముద్దగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె వేసి,
ధనియాల పొడి, జీలకర్ర పొడిని కొంచంగా వేయించి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు
వేసి కొంచెంసేపు వేయించిన తరవాత వంకాయముక్కలు వేసి, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి 10
నిముషాలు ఉంచాలి. బాగా మగ్గాక, మూత తీసి, రుబ్బి ఉంచుకున్న నూలుముద్ద, కారం వేసి,
కొంచెం నీరు పోసి, ముద్ద అంతా కూరకి పట్టినంతవరకు ఉంచి, దించాలి. అంతే నోరు
ఊరించే, నూపిండి వంకాయ కూర రెడీ....
No comments:
Post a Comment