30.4.13

అరటికాయ ఆవపెట్టి కూర

అరటికాయ ఆవపెట్టి కూర

కావలసిన పదార్థాలు
అరటికాయలు--4
ఎండుమిర్చి--4
చింతపండురసం--1/2 కప్పు
ఉప్పు---రుచికి తగినంత
పసుపు--చిటికెడు
పోపుదినుసులు--కొంచెం
కరివేపాకు-- 4 రెమ్మలు
నూనె --50 గ్రాములు
ఆవముద్ద--
(ఆవముద్ద తయారుచేయు విధానం:::2 స్పూన్స్ సెనగపప్పు, 3 స్పూన్స్ నూలుపప్పు, 2స్పూన్స్ ఆవాలు, 3 పచ్చిమిర్చి......ఇవి అన్ని కలిపి 1 గంట నానపెట్టి రుబ్బుకుంటే ఆవముద్ద రెడీ అవుతుంది)

తయారి విధానం
అరటికాయలు చెక్కుతీసి, ముక్కలుగా కోసి, నీటిలో వేసి, స్టవ్ మీద పెట్టి, ముక్క మెత్తబడే వరకు ఉంచి, నీరు వంపి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలి పెట్టి, నూనె వేసి కాగాక, పోపుదినుసులు & కరివేపాకు వేసి, పోపు వేగాక ఉడికించి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని వెయ్యాలి. ఇప్పుడు ఆ ముక్కలలో, ఉప్పు, చింతపండు రసం, పసుపు వేసి 5 నిముషాలు మగ్గనియ్యాలి. చివరిలో కూరని దింపే ముందు, ఆవముద్ద, కొంచెం నూనె వేసి కలపాలి... దించి వేరే డిష్ లోకి తీసుకోవాలి....... అంతే అరటికాయ ఆవకూర రెడీ......




వంకాయ కొత్తిమీర కారం కూర

వంకాయ కొత్తిమీర కారం కూర

కావలసిన పదార్థాలు:
వంకాయలు--పావు కిలో 
పచ్చిమిర్చి--10
కొత్తిమీర------అర కట్ట
అల్లం----------తగినంత
ఉప్పు ----------పెద్ద చెమ్చా
నూనె ----------తగినంత

తయారుచేసే విధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, అందులో తగినంత నూనె వేసి, తరిగిన వంకాయ ముక్కల్ని వెయ్యాలి.మూత పెట్టి, 10 నిమిషాలు అయ్యిన తరవాత
తీసి అందులో ముందుగా తయారుచేసి ఉంచుకున్న అల్లం,కొత్తిమీర,పచ్చిమిర్చి & ఉప్పు అన్ని కలిపిన ముద్దని బాణలిలో వెయ్యాలి .తిరిగి మూత పెట్టి కూర మగ్గేంత వరకు ఉంచి......దించి వేరే డిష్ లో సర్వ్ చెయ్యాలి.......ఇప్పుడు కొత్తిమీర వంకాయ కూర రెడీ ......మీరు కూడా తయారుచేసి చూడండి....


 

బెండకాయ పులుసు-మెంతికూర

బెండకాయ పులుసు-మెంతికూర
బెండకాయలు-1/4 కేజీ 
చింతపండు కొద్దిగా 
ఉప్పు రుచికి సరిపడినంత 
పసుపు చిటికెడు
పోపుదినుసులు & కరివేపాకు
నూనే చిన్న గ్లాసుడు
మెంతిపొడి ..4 టేబుల్'స్పూన్స్
(మెంతిపొడి తయారుచేయు విధానం:
కావలసిన సామగ్రి
1 గ్లాస్ సెనగపప్పు
1 గ్లాస్ మినప్పప్పు
1/4 గ్లాస్ ధనియాలు
2 స్పూన్స్ మెంతులు
1 స్పూన్ జీలకర్ర
25 ఎండుమిరపకాయలు
తయారుచేయు విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, ఒకొక్క సామానుని వేటికవి దోరగా వేయించి(మాడిపోకుండా) చల్లారిన తరవాత అన్ని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి....అంతే మెంతిపొడి రెడీ..........ఈ పొడిని కొన్ని రకాల పులుసు పెట్టిన కూరలలో వేసుకోవచ్చును.......సాంబారు & ముక్కల పులుసులలో కూడా ఈ పొడిని వేసుకోవచ్చును....)
కూర తయారుచేసే విధానం
ముందుగ బెండకాయలు శుభ్రంగా కడిగి, ముక్కలు తరిగి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి బెండకాయల ముక్కలు వేసి,అందులో చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. మళ్లి స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి, పోపు సామాన్లు వేసి పోపు వేగిన తరవాత ఉడికించి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వెయ్యాలి.10 నిముషాలు మగ్గాక ముందుగా తయారుచేసి పెట్టుకున్న మెంటిపోడిని 2 స్పూన్స్ వెయ్యాలి,ఇప్పుడు కూర బాగా కలిపి వేరే సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి.అంతే బెండకాయ పులుసు మెంతిపొడి కూర రెడీ.....



బీరకాయ ఉల్లికారం కూర

బీరకాయ ఉల్లికారం కూర
కావలసిన పదార్థాలు
బీరకాయలు 1/2కేజీ 
ఉల్లిపాయలు 5
ఎండుమిరపకాయలు 10
ధనియాలు 1పెద్ద స్పూన్
జీలకర్ర 1/2స్పూన్
నూనె, & ఉప్పు సరిపడినంత
(ఉల్లి ముద్ద తయారు చేయు విధానం....ఉల్లిపాయ ముక్కలు,ఎండుమిర్చి,ధనియాలు
 జీలకర్ర,ఉప్పు అన్ని కలిపి ముద్దగా రుబ్బుకోవాలి..అంతే ఉల్లిముద్ద రెడీ ఐపోయింది)
కూర తయారుచేసే విధానం
ముందుగ బీరకాయల్ని శుభ్రంగా కడిగి చెక్కు తీసుకుని,ఒక కాయని 2 ముక్కలు చేసుకోవాలి. గుత్తులుగా తరిగి పెట్టుకోవాలి.ఈ గుత్తులలోని ముందుగ రెడీ చేసుకున్న ఉల్లి ముద్దని ఉంచాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నునె వేసి సిద్ధం చేసుకున్న బీరకాయ ముక్కల్ని వెయ్యాలి.మూత పెట్టి సన్నని సెగ మీద మగ్గించాలి.ముక్కలు మెత్తబడిన తరవాత మూత తీసి నీరు పోయి నూనె పైకి తేలే అంతవరకూ ఉంచి కూర దించుకోవటమే.అంతే బీరకాయ ఉల్లికారం కూర రెడీ.......



పనసపొట్టు ఆవ కూర

పనసపొట్టు ఆవ కూర:-

కావలసిన పదార్థాలు:
పనసపొట్టు- 1/4 కేజీ
చింతపండు- పెద్ద నిమ్మకాయంత
ఉప్పు -రుచికి సరిపడినంత
పసుపు -చిటికెడు
పోపు సామాన్లు
నూనె -ఒక కప్పు
జీడిపప్పు -50గ్రా
అల్లం'ముక్క చిన్నది
ఇంగువ సరిపడినంత
(ఆవముద్ద తయారుచేయు విధానం:::3 స్పూన్స్ సెనగపప్పు, 3 స్పూన్స్ నూలుపప్పు, 2స్పూన్స్ ఆవాలు, 4 పచ్చిమిర్చి......ఇవి అన్ని కలిపి 1 గంట నానపెట్టి రుబ్బుకుంటే ఆవముద్ద రెడీ అవుతుంది)

కూర తయారుచేసే విధానం:-
ముందుగ స్టవ్ వెలిగించి,ఒక గిన్నెలో పనసపోట్టుని వేసి ....చింతపండు రసం, ఉప్పు, పసుపు వేసి 15 నిమిషములు ఉడికించి, నీరు ఉంటే వార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బాణలి తీసుకొని నూనె వేసి, పోపు దినుసులు, అల్లం ముక్కలు,కరివేపాకు, ఇంగువ,జీడిపప్పు వేసి వేగాక వార్చిపెట్టుకున్న పనసపొట్టును వెయ్యాలి.5 నిమిషములు అయ్యాక ముందుగా తయారుచేసి ఉంచుకున్న ఆవ ముద్దని వేసి, కొంచం నూనె వేసి, కదిపి 5 నిమిషములు ఉంచి దించెయ్యటమే.అంతే ఎంతో రుచికరమైన పనసపొట్టు ఆవ కూర రెడీ.......


పనసకాయ కుర్మ కూర

పనసకాయ కుర్మ కూర
కావలసిన పదార్థాలు
పనసకాయ కుర్మాముక్కలు--1/2
(కూరకి తగినట్లుగా ముక్కలు మార్కెట్లో అమ్ముతారు) 
చింతపండు-పెద్ద నిమ్మకాయంత
ఉప్పు -రుచికి సరిపడినంత
పసుపు -చిటికెడు
అల్లం&వెల్లుల్లి పేస్ట్ -2 స్పూన్స్
ఉల్లిముద్ద -1 కప్
తరిగిన ఉల్లిపాయల ముక్కలు-1 కప్
గరం మసాలా పొడి- 2 స్పూన్స్
పొడి కారం -2స్పూన్స్
జీడిపప్పు -50గ్రాములు
కొత్తిమీర -కొంచంగా
నూనె -150గ్రాములు

తయారుచేసే విధానం
ముందుగ స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో పనసకాయ ముక్కల్ని చింతపండు రసం,ఉప్పు,పసుపు వేసి 20 నిమిషాలు ఉడికించి పక్కన పెట్టుకోవాలి.ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేసి జీడిపప్పు ఉల్లిముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు & ఉల్లిముద్ద వేసి పచ్చి వాసన పోయేంతవరకు బాగా వేయించాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న పనస కుర్మ ముక్కల్ని వేసి గరం మసాల పొడి & కారం పొడి వేసి, ఒక గ్లాస్ నీళ్ళు పోసి బాగా ఉడికించాలి.ఎంతవరకు అంటే నీరు అంతా పోయి నూనె పైకి తేలేంతవరకు.అంతే ఇప్పుడు తయారైన కూరని ఒక డిష్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవటమే......అంతే ఘుమఘుమలాడే పనస కుర్మా కూర రెడీ.......


కాకరకాయ ఉల్లి ముద్ద కూర

కాకరకాయ ఉల్లి ముద్ద కూర
కావలసిన పదార్థాలు
కాకరకాయలు 1/2 కేజీ 
ఉల్లిపాయలు 1/4
పొడికారం 4 స్పూన్స్
ఉప్పు- రుచికి సరిపడినంత
ధనియాలపొడి -1 స్పూన్
అల్లం & వెల్లుల్లి పేస్టు- 1 స్పూన్
జీలకర్ర పొడి- 1/2 స్పూన్
నూనె- 150 గ్రా
(ఉల్లి పాయలు అన్ని పొట్టు తీసి ముక్కలుగా కోసి ముద్ద రుబ్బి ఉంచుకోవాలి)

తయారు చేయు విధానము
కాకరకాయలని శుభ్రంగా కడిగి, కాయని 4 చీలికలుగా, గుత్తుగ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసిచీల్చిన కాకరకాయల ముక్కల్ని,కొద్ది -కొద్దిగా వేస్తూ సన్నని మంట మీద గోధుమ రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి...అన్ని వేయించి తీసాక....బాణలిలో ఉన్న నూనెలో ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఉల్లిముద్దని వేసి అది వేగిన తరవాత , ధనియాలపొడి...జీలకర్రపొడి & అల్లం వెల్లుల్లి పేస్టువేసి బాగా వేయించాలి..... ఉల్లిముద్ద కమ్మని వాసన వచ్చే వరకు వేయించి అప్పుడు పక్కనే ఉంచిన కాకరకాయల ముక్కల్ని వేసి, ఒక గ్లాసుడు నీరు పోసి బాగా మగ్గించాలి.....ఇప్పుడు స్టవ్ని పెద్ద సెగమీద పెట్టాలి... నీరు అంతా పోయి నూనె పైకి తేలేంతవరకు వేయించాలి.....అంతే వేడి-- వేడి కాకరకాయ ఉల్లి ముద్ద కూర రెడీ .......



బ్రెడ్ ఊతప్పమ్

బ్రెడ్ ఊతప్పమ్

కావలసిన పదార్థాలు
బ్రెడ్ ముక్కలు --20
పుల్లటి మజ్జిగ --4 కప్పులు
బియ్యం పిండి --4 స్పూన్స్
మైదాపిండి --2 స్పూన్స్
తరిగిన ఉల్లిపాయ ముక్కలు --2 కప్పులు
పచ్చిమిర్చి --6
క్యారెట్ తురుము --1/2 కప్పు
టమాట --1
అల్లం-- చిన్న ముక్క
కారం --1/2 స్పూన్
ఉప్పు --రుచికి తగినంత
కరివేపాకు --3 రెబ్బలు
కొత్తిమీర --1 కప్పు
నూనె --50 గ్రా

తయారీ విధానం
బ్రెడ్ అంచులు తీసి, పుల్లటి మజ్జిగలో 10 నిమిషాలు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి అందులో తరిగిన ఉల్లి ముక్కలు, క్యారెట్, అల్లం-పచ్చిమిర్చి ముక్కలు,టమాట ముక్కలు అన్ని వేసి...కొంచెం సేపు వేగాక ఉప్పు -కారం వేసి దించి పక్కన పెట్టుకోవాలి......ఇప్పుడు మజ్జిగలో నానబెట్టిన బ్రెడ్ ముక్కల్ని వరిపిండి కలిపి మిక్సీలో మెత్తగా దోసల పిండిలాగా రుబ్బుకోవాలి......ఇప్పుడు రుబ్బిన మిశ్రమంలో వేయించి పక్కన పెట్టుకున్న ముక్కల్ని కలిపి, కొంచెం మందపాటి దోసలలాగా నూనె ఎక్కువగా వేసి సన్నటి సెగ మీద కాల్చుకోవాలి..దోస పైన మూతపెట్టి ఉంచాలి......దోసని రెండు వైపులా దోరగా కాల్చుకోవాలి......అంతే వేడి--వేడి బ్రెడ్ ఊతప్పం రెడీ........
ఈ ఊతప్పాన్ని ఇష్టమైతే సాస్-----చట్ని వేటితో ఐనా నంజుకుని తినొచ్చు.......ఇది సాయంత్రం సమయంలో snack item లాగ తినొచ్చును......


ఆలూ బోండా

ఆలూ బోండా

కావలసిన పదార్థాలు
బంగాళదుంపలు -1/4(ఉడికించి, తొక్కతీసి....మెత్తగా చిదిమి ఉంచాలి)
ఉల్లిపాయలు --3 (చిన్న--చిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి)
అల్లం & వెల్లుల్లి పేస్టు --3 స్పూన్స్
పొడికారం--4 స్పూన్స్
నూనె --1/4 కేజీ
ఉప్పు --రుచికి తగినంత
శెనగపిండి --1/4 కేజీ
వరిపిండి --6 స్పూన్స్

తయారుచేయు విధానం
ముందుగా సెనగపిండిలో....వరిపిండి, కొంచెం ఉప్పు-కారం, 1 స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్టు కలిపి కొంచెం....కొంచెంగా నీరు పోస్తూ బజ్జీల పిండిలాగా కలుపుకోవాలి.....ఇప్పుడు ఉడికించిన బంగాలదుంపల ముద్దలో ఉల్లిపాయల ముక్కలు, మిగిలిన అల్లం-వెల్లుల్లి పేస్టు రుచికి సరిపడినంతగా ఉప్పు--కారం కలిపి,.... చిన్న- చిన్న బాల్స్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి.......ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి ,నూనెపోసి.....నునెకాగాక ముందుగా చేసి పెట్టుకున్న బంగాళదుంపలబాల్స్ ని......సెనగపిండిలో ముంచి వేసుకోవాలి......కమ్మటి వాసన వచ్చేవరకు వేయించి తీసుకోవాలి..........అంతే వేడి---వేడి ఆలూ బోండా రెడీ.......ఈ బోండాలని కొబ్బరి చట్ని, గ్రీన్ చట్నీ  లేదా టమాట చట్నిలతో గాని తింటే రుచిగా ఉంటాయి........


కంద-బచ్చలి కూర

కంద-బచ్చలి కూర

కావలసిన సామాన్లు
కంద 1/2...kg 
బచ్చలి కూర.....4 కట్టలు 
చింతపండు రసం....1/2 కప్పు
ఆవాలు ఆవాలు...2 స్పూన్స్
ఎండుమిర్చి...3
ఉప్పు....రుచికి తగినంత
సెనగపప్పు....3 స్పూన్స్
మినపప్పు..2 స్పూన్స్
పచ్చిమిర్చి...3
అల్లంతురుము....1 స్పూన్
జీలకర్ర....1 స్పూన్
పసుపు....చిటికెడు
ఇంగువ...చిటికెడు
కరివేపాకు రెబ్బలు...2
(ఆవముద్ద తయారుచేయు విధానం:::2 స్పూన్స్ సెనగపప్పు, 3 స్పూన్స్ నూలుపప్పు, 2స్పూన్స్ ఆవాలు, 3 పచ్చిమిర్చి......ఇవి అన్ని కలిపి 1 గంట నానపెట్టి రుబ్బుకుంటే ఆవముద్ద రెడీ అవుతుంది)

తయారుచేయు విధానం
ముందుగా కందను శుభ్రంగా కడిగి తొక్కు తీసి, ముక్కలుగా కోసి,నీటిలో ఉంచుకోవాలి.బచ్చలి కూరని కూడా కడగి సన్నగా తరిగి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో కంద ముక్కలు వేసి,,చింతపండు రసం వేసి,,,తగినంత ఉప్పు& పసుపు వేసి మెత్తగా ఉడికించి దించుకోవాలి.......ఇప్పుడు బాణలి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు వేసి తరిగిన బచ్చలికూరని వేసి ఉడికించుకోవాలి...ముందుగ ఉడికించి పక్కనపెట్టుకున్న కందముక్కలువేసి మరో 10 నిముషాలు ఉడికించి, ఆవముద్ద వేసి కలిపి దించుకోవాలి ......అంతే ఎంతో రుచికరమైన కందబచ్చలి కూర రెడీ ....... .




కోవా నువ్వుల లడ్డు

కోవా నువ్వుల లడ్డు

కావలసిన పదార్థాలు
నువ్వులు... 2కప్పులు
పంచదార పొడి... 2కప్పులు
కోవా... 2కప్పులు
బాదాం పిస్తా... 3స్పూన్స్

తయారు చేయు విధానము
ముందుగా స్టవ్ వెలిగించి బాణలిలో నువ్వులు వేయించి పొడి చేసుకోవాలి. సన్నని సెగ మీద కోవాని గోధుమ రంగు లోకి వచ్చేవరకు వేయించి చల్లార్చుకోవాలి. తరవాత నువ్వులపొడి, పంచదారపొడి వేసి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని స్టవ్ మీద పెట్టి కొంచం వేడి అయ్యాక దించి ఉండలు చుట్టి బాదాం పిస్తా ముక్కులు అద్దుకోవాలి. అంతే రుచికరమైన కోవ లడ్డూ రెడీ....


సేమియాగారెలు:

సేమియాగారెలు:

కావలసిన పదార్థాలు::
సేమియా--2 కప్పులు
పెరుగు--1 కప్పు
బియ్యంపిండి--1 కప్పు
సెనగపప్పు--1/2 కప్పు
తరిగిన ఉల్లిపాయ ముక్కలు--2 కప్పులు
పచ్చిమిర్చి,అల్లం,జీలకర్ర & వెల్లుల్లి పేస్టు---3 స్పూన్స్
కొబ్బరితురుము---1/2 కప్పు
మైదాపిండి--5 స్పూన్స్
ఉప్పు--రుచికితగినంత
నూనె---1/4 కేజీ

తయారుచేయు విధానం:--
2 గంటల ముందుగా సెనగపప్పుని నానపెట్టుకోవాలి. సేమియాని ఒకసారి నీటిలో వేసి కడిగి పెరుగులో వేసుకోవాలి.....ఈ పెరుగులోనే నానపెట్టిన సెనగపప్పు, బియ్యంపిండి,తరిగిన ఉల్లిపాయముక్కలు,అల్లం,వెల్లుల్లి,పచ్చిమిర్చి & జీలకర్ర పేస్టు, మైదాపిండి, కొబ్బరితురుము & ఉప్పు వేసి గారెల పిండిలాగా గట్టిగ కలుపుకోవాలి.....ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె పోసి, కాగాక చిన్న-చిన్న వడల లాగ వేసుకోవాలి..దోరగా వేయించి తీసుకోవటమే......అంతే కరకరలాడే కమ్మని సేమియాగారెలు రెడీ........వీటికి చట్నితో పని లేదు.....


నిమ్మ పులిహొర

నిమ్మ పులిహొర 

కావలసిన పదార్థాలు:--
అన్నం--4 కప్పులు
నిమ్మకాయలు--2
పచ్చిమిర్చి--4
వేరుసెనగ గుళ్ళు--1/2 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు--చిటికెడు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-2, ఇంగువ) కరివేపాకు & కొత్తిమీర....కొంచెం
నూనె-- 50 గ్రాములు

తయారుచేయు విధానం:--
ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, నిమ్మ రసం, కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించి.....అన్నం పైన వేసి కలుపుకోవాలి....పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి....కొట్టేమీర పైన వేసుకొని అలంకరించుకుంటే.....బావుంటుంది.....అంతే పుల్లపుల్లని నిమ్మ పులిహొర రెడీ.....మీకు తినాలనిపిస్తుంది కదా.....మరెందుకు ఆలస్యం.....త్వరగా చేసేయ్యండి.........


అరటికాయ ఉప్మా కూర

అరటికాయ ఉప్మా కూర
కావలసిన పదార్థాలు
అరటికాయలు --4
ఉల్లిపాయల ముక్కలు -1 కప్పు 
నిమ్మకాయలు --2
అల్లం & పచ్చిమిర్చి ముక్కలు --4 స్పూన్స్
పోపుదినుసులు --కొంచెం
కరివేపాకు రెమ్మలు --4
వేరుసెనగ పప్పు(గుళ్ళు)--3 స్పూన్స్
ఉప్పు, పసుపు --తగినంత
నూనె --50 గ్రాములు
తయారివిధానం
ముందుగ స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో నీరు పోసి, అరటికాయలు చెక్కు తీయకుండా 2 ముక్కలుగా కోసి, ఉడికించి, చల్లారక తోక్కలుతీసి చిదిమి పెట్టుకోవాలి.. ఇప్పుడు స్టవ్ మీద బాణలి పెట్టి నూనె వేసి కాగాక అందులో పోపు దినుసులు & కరివేపాకు వేసి, అల్లం- పచ్చిమిర్చి ముక్కలు వేసి,కదిలించి ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేగాక, చిదిమి పక్కన పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని, ఉప్పు - పసుపు వేసి కదిపి దించుకోవాలి... ఇప్పుడు నిమ్మరసం కలుపుకోవాలి... అంతే వేడి -వేడి అరటికాయ ఉప్మా కూర రెడీ.....



వంకాయ & ములక్కాడ కూర

వంకాయ & ములక్కాడ కూర

కావలసిన పదార్థాలు
వంకాయలు 1/2 కేజీ 
ములక్కాడలు -6
ఉల్లిపాయలు -3
సెనగపప్పు -4 స్పూన్స్
చింతపండురసం -1 కప్పు
ఉప్పు & పసుపు -తగినంత
కారం -2 స్పూన్స్
నూనె -50 గ్రా
కరివేపాకు & కొత్తిమీర --కొంచెంగా
పోపుదినుసులు
తయారీ విధానము
ముందుగ స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి, నూనె వేసి, పోపుదినుసులు వేసి వేగాక, ఉల్లిపాయముక్కలు, కరివేపాకు వేసి కదిపి, వంకాయ ముక్కలు, ములక్కాడ ముక్కలు, సెనగపప్పు, ఉప్పు , చింతపండురసం, పసుపు,
కారం అన్ని వేసి మూతపెట్టి, ఉడికించుకోవాలి.చివరగా ఉడికిన తరవాత దించేముందు కొత్తిమీర వేసుకోవాలి..... ఇష్టమైన వారు ఇందులో ఒడియాలు కూడా వేసుకోవచ్చును... అంతే ఎంతో రుచికరమైన వంకాయ & ములక్కాడల కూర రెడీ...



బంగాళదుంపల ముద్ద కూర(Baby Potato Curry)...

బంగాళదుంపల ముద్ద కూర(Baby Potato Curry)... 
కావలసిన పదార్థాలు
చిన్న బంగాళదుంపలు -1/2 కేజీ 
ఉల్లిపాయలు -1/4 కేజీ 
అల్లం, వెల్లుల్లి & పచ్చిమిర్చి పేస్టు--2 స్పూన్స్
టమాటాలు -2
పచ్చికారం -1 స్పూన్
పోపుదినుసులు & కరివేపాకు
ఉప్పు, పసుపు ---తగినంత
నూనె --100 గ్రాములు
ధనియాల పొడి, జీలకర్ర పొడి--1/2 స్పూన్
కొబ్బరిముక్క --చిన్నది
కొత్తిమీర --కొంచెంగా

తయారి విధానము
ముందుగా కొబ్బరి, ధనియాల పొడి, జీలకర్రపొడి, 2 ఉల్లిపాయలు అన్నీ కలిపి ముద్దగా రుబ్బి ఉంచుకోవాలి. బంగాళదుంపలుని ఉడికించి, తొక్కతీసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, కాగాక పోపుదినుసులు, కరివేపాకు వెయ్యాలి.. ఇప్పుడు సన్నగా తరిగిఉంచుకున్న టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి.. బాగా వేయించాక కొబ్బరి ముద్దని & అల్లం-వెల్లుల్లి-పచ్చిమిర్చి పేస్టు ని వేసి, బాగా వేయించి, గ్లాసుడు నీరు పోసి, ఉప్పు -పసుపు వేసి దగ్గరికి వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న దుంపలకి చిన్నగా సూదితో కన్నాలు పెట్టుకోవాలి. అలా చేసినట్లైతే దుంపలలోకి కూరలో ఉన్న ముద్ద యొక్క రసం చేరుతుంది. ఇప్పుడు కన్నాలుపెట్టిన దుంపలని బాణలిలో వెయ్యాలి.. ఇప్పుడు కూర దించేముందు కొత్తిమీర జల్లుకుని దించుకోవటమే. అంతే రుచికరమైన బంగాళదుంపల ముద్దకూర రెడీ
 ....



అటుకుల పులిహోర

అటుకుల పులిహోర:--

కావలసిన పదార్థాలు:-
అటుకులు --4 కప్పులు
ఉల్లిపాయముక్కలు -- 2 కప్పులు
బంగాళాదుంపలు -- 2 కప్పులు
టమాట ముక్కలు -- 2 కప్పులు
కారెట్ తురుము -- 1/2 కప్పు
వేరుశనగ గుళ్ళు -- 1/2 కప్పు
పచ్చిమిర్చి -- 8 చీలికలు చేసినవి
పోపుదినుసులు & కరివేపాకు
ఇంగువ, ఉప్పు & పసుపు
నిమ్మకాయలు -- 2
నూనె -- 100 గ్రా

తయారీ విధానము:-
ముందుగా అటుకులను శుభ్రంగా బాగుచేసి కడిగిపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె వేసి కాగిన తరవాత పోపుదినుసులు, కరివేపాకు వేసి, వేగిన తరవాత, వేరుసెనగ గుళ్ళు, ఇంగువ వేసి, తరిగిపెట్టుకున్న కూరలు అన్ని వేసి బాగా కదిపి, అన్ని వేగాక అటుకులు, ఉప్పు పసుపు వేసి బాగా కదిపి, అన్ని కలిసాక స్టవ్ మీద నుండి దించుకోవటమే. ఇష్టమైన వాళ్ళు నిమ్మకాయ రసం వేసుకోవచ్చును. అంతే వేడి వేడి అటుకుల పులిహోర రెడీ........


సొజ్జి బూర్లు

సొజ్జి బూర్లు:-

కావలసిన పదార్థాలు:-
గోధుమ(బొంబాయి)రవ్వ --2 కప్పులు
పంచదార -- 2 కప్పులు
యాలకపొడి -- 1 స్పూన్
తోపు పిండి(1 కప్పు మినప్పప్పు , 3 కప్పులు బియ్యం---3 గంటల ముందుగా నానబెట్టి రుబ్బి ఉంచుకోవాలి)
నూనె -- 1/2 కేజీ

తయారివిధానము:--
ముందుగా స్టవ్ వెలిగించి, మందపాటి గిన్నె పెట్టి, 4 1/2 కప్పుల నీరు పోసి, మరిగించాలి. బాగా మసిలిన తరవాత రవ్వ, పంచదార & యాలకపొడి అన్ని వేసి ఉండకట్టకుండా కలుపుకోవాలి, కొంచెం నూనె వేసి కలిపితే ఉండకట్టకుండా ఉంటుంది. ఇప్పుడు గట్టిపడినతరవాత దించి, ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసి ఆరబెట్టాలి. చల్లారిన తరవాత చిన్న చిన్న ఉండలుగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె పోసి కాగాక, ముందుగా రుబ్బి ఉంచుకున్న తోపు పిండిలో ఒక్కొక్క రవ్వ ఉండని ముంచి నూనె లో వేసి, గోధుమ రంగు వచ్చే వరకు వేయించి తీసుకోవాలి...అంతే నోరూరించే సొజ్జి బూర్లు రెడీ......ఇవి రెండు మూడు రోజుల వరకు ఉంటాయి.




బీట్రూట్ బొబ్బోట్లు

బీట్రూట్ బొబ్బోట్లు

కావలసిన పదార్థాలు
బీట్రూట్ --1/4 కేజీ
మైదాపిండి -- 1/4 కేజీ
పంచదార --1/4 కేజీ
నెయ్యి --50 గ్రా
యాలకులపొడి --1 స్పూన్

తయారివిధానం
బొబ్బట్లు చేసుకునే ఒక గంట ముందుగా, మైదాపిండిని పూరి పిండిలాగా మెత్తగా నీటితొ పాటు, నూనె వేసి కలిపి పైన తడి గుడ్డ వేసి మూత పెట్టి ఉంచుకోవాలి. ముందుగా బీట్రూటు ని చెక్కు తీసి, కోరు చేసుకుని ఉంచుకోవాలి.ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, ఒక స్పూన్ నెయ్యివేసి బీట్రూట్ కోరు, పంచదార యాలకల పొడి వేసి కమ్మగా, గట్టిపడే వరకు వేయించి పక్కన ఉంచుకోవాలి. చల్లారిన తరవాత ఉండలు చుట్టి ఉంచుకోవాలి. ఇప్పుడు ముందుగా కలిపి ఉంచుకున్న మైదాపిండిని, చిన్న చిన్న ఉండలుగా చేసుకుని పూరీలు లాగా ఒత్తుకుని మధ్యలో బీట్రూట్ ఉండలని ఉంచి చుట్టూ మూసి, మళ్ళి పూరీలుగా ఒక ఆకు పైన చేతితో వత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెనం పెట్టి సన్నని మంటపై బొబ్బట్లని కాల్చుకోవాలి. అంతేవేడి -వేడి బొబ్బట్లు రెడీ. ఇవి ఒక వారంరోజుల వరకు నిల్వ ఉంటాయి. చిన్న- పెద్ద అందరు ఇష్టంగా తింటారు.


కొబ్బరి -- మామిడి పచ్చడి

కొబ్బరి -- మామిడి పచ్చడి
కావలసిన పదార్థాలు
కొబ్బరి తురుము -- 2 కప్పులు 
మామిడి తురుము -- 1 కప్పు 
ఎండుమిరపకాయలు -- 10
పోపుదినుసులు, ఇంగువ, ఉప్పు, పసుపు & నూనె
తయారీవిధానము
ముందుగా స్టవ్ వెలిగించి బాణలిపెట్టి, కొంచెం నూనెవేసి, కాగినతరవాత--పోపుదినుసులు, ఇంగువ, ఎండుమిరపకాయలు వేసి బాగా వేగినతరవాత దించి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పోపులో కొబ్బరితురుము, మామిడి తురుము, తగినంత ఉప్పు , పసుపు వేసి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. అంతే పుల్ల -- పుల్లని కొబ్బరి -- మామిడి పచ్చడి రెడీ. ఇష్టమైన వాళ్ళు పచ్చడిపై మిరపకాయి , ఆవాలు, ఇంగువ అన్ని కలిపి, పోపు వేసుకోవచ్చును వచ్చును.


ఉగాది పచ్చడి

ఉగాది పచ్చడి
ఉగాది పచ్చడి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలు మీకు తెలియచేస్తున్నాను.
ఈ పచ్చడిలో ఆరు రుచులు కలసి ఉంటాయి, ఆరు ఋతువులకు ప్రతీక---తీపి--చేదు, ఉప్పు--కారం, పులుపు--వగరు.
1) తీపిని కలిగించే కొత్త బెల్లం---ఆకలిని కలిగిస్తుంది.
2) పులుపునిచ్చే చింతపండు---కఫ వాతాలని పోగొడుతుంది.
3) కారం---శరీరంలోని క్రిముల్ని నాశనం చేయటమే కాక, శ్లేష్మ రోగాలని దరిచేరనీయదు.
4) వగరు పుట్టించే మామిడి--- లాలాజలాన్ని ఊరించి, జీర్ణక్రియకి తోడ్పడుతుంది.
5)వేపపువ్వు---కడుపులోని ఏమైనా అనారోగ్య దోషాలు ఉంటే, వాటిని దూరం చేస్తుంది. కడుపులో ఉన్న నులిపురుగును చంపి, తిరిగి పుట్టనీయకుండా చేస్తుంది. ఇందులోఇంకా చాలా ఔషధగుణాలున్నాయి.
6) ఉప్పు--ఎముకలని బలపరుస్తుంది.
మన సంవత్సర ఫలితం ఉగాది పచ్చడి మీద ఆధారపడి ఉంటుందట. తీపిఎక్కువగ ఉంటే, మనజీవితం ఆనందమయంగా ఉంటుందని చెబుతారు. అలా అని మనం కోరుండి తీపి ఎక్కువ వేసుకుని తినకూడదు. మనకు నచ్చిన, నచ్చకపోయినా తప్పనిసరి ఈ పచ్చడిని, ఈ ఒక్కరోజు తిని తీరాలి.


వంకాయ నువ్వుపిండి కూర

వంకాయ నువ్వుపిండి కూర
 కావలసిన పదార్థాలు
చిన్ని వంకాయలు --1/2 కేజీ 
నూలుపొడి --2 కప్పులు 
ధనియాలపొడి --1 స్పూన్
జేలకర్రపొడి --1 స్పూన్
తరిగిన ఉల్లిపాయ ముక్కలు --1 కప్పు
తరిగిన టమాటా ముక్కలు --1 కప్పు
పొడికారం --4 స్పూన్స్
ఉప్పు & నూనె --తగినంత

తయారివిధానం
ముందుగా వంకాయలని 4 చిలికలుగా చేసుకుని నీటిలో వేసుకోవాలి. నూలుపొడిని మిక్సీలో వేసి రుబ్బుకొని ముద్దగా చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె వేసి, ధనియాల పొడి, జీలకర్ర పొడిని కొంచంగా వేయించి, ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు వేసి కొంచెంసేపు వేయించిన తరవాత వంకాయముక్కలు వేసి, ఉప్పు వేసి కలిపి మూతపెట్టి 10 నిముషాలు ఉంచాలి. బాగా మగ్గాక, మూత తీసి, రుబ్బి ఉంచుకున్న నూలుముద్ద, కారం వేసి, కొంచెం నీరు పోసి, ముద్ద అంతా కూరకి పట్టినంతవరకు ఉంచి, దించాలి. అంతే నోరు ఊరించే, నూపిండి వంకాయ కూర రెడీ....



వేసవి చిట్కాలు

వేసవి చిట్కాలు


1) ఆహారపథార్థాలలో నూనె కొంచెం తగ్గించి వాడాలి.
2) ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.
3) ఉదయం పూట నూనె వంటలు కాకుండా, ఆవిరి కుడుములు ఇడ్లీలు ఆరోగ్యకరమైనవి.
4) కర్భుజాలు ఎక్కువగా తీసుకోవాలి.
5) మజ్జిగ అన్నంలో మామిడి పండ్లు తింటే విటమిన్ A & D లు ఎక్కువగా శరీరానికి అందుతాయి.
6) కూల్ డ్రింక్స్ కన్నా, కొబ్బరి నీళ్ళు చాలా మంచివి.
7) ప్రతీరోజు, ఏదో ఒక సమయంలో, శెనగపిండి లో, నిమ్మరసం లేదా పెరుగుని కలుపుకుని ముఖానికి రాసుకుని, ఆరాక చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేసినట్లయితే ముఖం కాంతివంతంగా అవుతుంది.
8) కిటికీలకు, గుమ్మాలకు వట్టి వేళ్ళుతెరలని తడిపి కట్టుకుంటే, వేడిని ఇంట్లోకి రానీకుండా, చల్లదనాన్ని ఇస్తుంది.
9) సాధారణంగా పిల్లలు వేసవి సెలవులలో, ఎండలోకి వెళ్ళి, ఆటలు ఆడుతారు. అలా ఎండలోకి వెళ్ళనీయకుండా, ఇండోర్ గేమ్స్ ఆడించాలి.
10) పలుచని మజ్జిగలో, కాసింత నిమ్మ లేదా డబ్బాకులు వేసి ఉప్పు వేసుకుని, పలుచగా కలిపి, పిల్ల, పెద్ద అందరూ తాగితే ఆరోగ్యానికి మంచిది.
11) వేసవిలో బయట జ్యూస్ లు ఎక్కువగా తీసుకోకుండా, ఇంట్లో అన్ని రకాల పండ్లతో మరియు కూరగాయలతో జ్యూస్ లు చేసుకుని తాగాలి.
12) ఒక గిన్నెడు నీటిలో ఎండు ద్రాక్షలు, ఖర్జూరాలు రాత్రి పూట నానపెట్టి, మర్నాడు ఆ పండ్లను గట్టిగ పిండి రసాన్ని తీసి, పిల్లలకి ఇస్తే వడ దెబ్బ తగలదు.


మామిడికాయ మెంతిముక్కలు

మామిడికాయ మెంతిముక్కలు
కావల్సిన పదార్థాలు
మామిడికాయలు --4
మెంతులు --2 స్పూన్స్ 
ఆవాలు --2 స్పూన్స్
ఉప్పు -- తగినంత
ఎండుమిర్చి --50 గ్రా
నూనె--100గ్రా
పసుపు --చిటికెడు
ఇంగువ --1/2 స్పూన్
తయారీ విధానము
ముందుగా మామిడికాయలు చెక్కుతీసుకుని, సన్నగా ముక్కలుగా, చేసిపెట్టుకోవాలి, ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెం నూనె వేసి, మెంతులు, ఆవాలు & ఎండుమిర్చి వేసి వేయించి, చివరగా ఇంగువ వేసి, దించెయ్యాలి. ఇప్పుడు వీటిని మిక్సీ లో వేసి పొడి చేసుకోవాలి. ఒక పాత్రలో తరిగిన మామిడి ముక్కలు, మిక్సీ చేసిన పొడి, ఉప్పు, పసుపు & మిగిలిన నూనె అన్నివేసి కలిపి మూతపెట్టుకుని ఉంచాలి. రెండోరోజు నుండి దీనిని వాడుకోవచ్చును. ఇష్టమైన వారు ఇందులో బెల్లం కలుపుకోవచ్చును. అంతే పుల్లపుల్లని మెంతిముక్కలు రెడీ.......


మామిడికాయ తొక్కుడు పచ్చడి

మామిడికాయ తొక్కుడు పచ్చడి



కావలసిన పదార్థాలు
మామిడి కాయలు --4
పొడి కారం -- 1 కప్పు 
ఉప్పు-- తగినంత
ఎండు మిరపకాయలు-- 3
ఆవాలు -- 1 చెంచా
ఇంగువ --1 చెంచా
వెల్లుల్లి రెబ్బలు --4

తయారీ విధానం
ముందుగా మామిడి కాయలు తొక్కలు తీసి, ముక్కలుగా చేసి, మిక్సీలో కచ్చా పచ్చాగా తిప్పి, తీసి ఎండలో ఒక పూట ఎండబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి, నూనె పోసి, కాగాక ఆవాలు--ఎండు మిరపకాయలు-- ఇంగువ వేసి వేయించి, దించుకోవాలి. ఇది చల్లారిన తురువాత ఎండబెట్టిన మామిడి తొక్కు, ఉప్పు --కారం కలిపి, మూత పెట్టి ఉంచాలి. ఇష్టమున్న వారు, వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు. అంతే నోరూరించె మామిడి తొక్కుడు పచ్చడి రెడీ.