30.4.13

బంగాళదుంపల ముద్ద కూర(Baby Potato Curry)...

బంగాళదుంపల ముద్ద కూర(Baby Potato Curry)... 
కావలసిన పదార్థాలు
చిన్న బంగాళదుంపలు -1/2 కేజీ 
ఉల్లిపాయలు -1/4 కేజీ 
అల్లం, వెల్లుల్లి & పచ్చిమిర్చి పేస్టు--2 స్పూన్స్
టమాటాలు -2
పచ్చికారం -1 స్పూన్
పోపుదినుసులు & కరివేపాకు
ఉప్పు, పసుపు ---తగినంత
నూనె --100 గ్రాములు
ధనియాల పొడి, జీలకర్ర పొడి--1/2 స్పూన్
కొబ్బరిముక్క --చిన్నది
కొత్తిమీర --కొంచెంగా

తయారి విధానము
ముందుగా కొబ్బరి, ధనియాల పొడి, జీలకర్రపొడి, 2 ఉల్లిపాయలు అన్నీ కలిపి ముద్దగా రుబ్బి ఉంచుకోవాలి. బంగాళదుంపలుని ఉడికించి, తొక్కతీసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె వేసి, కాగాక పోపుదినుసులు, కరివేపాకు వెయ్యాలి.. ఇప్పుడు సన్నగా తరిగిఉంచుకున్న టమాట ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వెయ్యాలి.. బాగా వేయించాక కొబ్బరి ముద్దని & అల్లం-వెల్లుల్లి-పచ్చిమిర్చి పేస్టు ని వేసి, బాగా వేయించి, గ్లాసుడు నీరు పోసి, ఉప్పు -పసుపు వేసి దగ్గరికి వచ్చేవరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఉడికించి పక్కన పెట్టుకున్న దుంపలకి చిన్నగా సూదితో కన్నాలు పెట్టుకోవాలి. అలా చేసినట్లైతే దుంపలలోకి కూరలో ఉన్న ముద్ద యొక్క రసం చేరుతుంది. ఇప్పుడు కన్నాలుపెట్టిన దుంపలని బాణలిలో వెయ్యాలి.. ఇప్పుడు కూర దించేముందు కొత్తిమీర జల్లుకుని దించుకోవటమే. అంతే రుచికరమైన బంగాళదుంపల ముద్దకూర రెడీ
 ....



No comments:

Post a Comment