30.4.13

కాకరకాయ ఉల్లి ముద్ద కూర

కాకరకాయ ఉల్లి ముద్ద కూర
కావలసిన పదార్థాలు
కాకరకాయలు 1/2 కేజీ 
ఉల్లిపాయలు 1/4
పొడికారం 4 స్పూన్స్
ఉప్పు- రుచికి సరిపడినంత
ధనియాలపొడి -1 స్పూన్
అల్లం & వెల్లుల్లి పేస్టు- 1 స్పూన్
జీలకర్ర పొడి- 1/2 స్పూన్
నూనె- 150 గ్రా
(ఉల్లి పాయలు అన్ని పొట్టు తీసి ముక్కలుగా కోసి ముద్ద రుబ్బి ఉంచుకోవాలి)

తయారు చేయు విధానము
కాకరకాయలని శుభ్రంగా కడిగి, కాయని 4 చీలికలుగా, గుత్తుగ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసిచీల్చిన కాకరకాయల ముక్కల్ని,కొద్ది -కొద్దిగా వేస్తూ సన్నని మంట మీద గోధుమ రంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి...అన్ని వేయించి తీసాక....బాణలిలో ఉన్న నూనెలో ముందుగా తయారు చేసి ఉంచుకున్న ఉల్లిముద్దని వేసి అది వేగిన తరవాత , ధనియాలపొడి...జీలకర్రపొడి & అల్లం వెల్లుల్లి పేస్టువేసి బాగా వేయించాలి..... ఉల్లిముద్ద కమ్మని వాసన వచ్చే వరకు వేయించి అప్పుడు పక్కనే ఉంచిన కాకరకాయల ముక్కల్ని వేసి, ఒక గ్లాసుడు నీరు పోసి బాగా మగ్గించాలి.....ఇప్పుడు స్టవ్ని పెద్ద సెగమీద పెట్టాలి... నీరు అంతా పోయి నూనె పైకి తేలేంతవరకు వేయించాలి.....అంతే వేడి-- వేడి కాకరకాయ ఉల్లి ముద్ద కూర రెడీ .......No comments:

Post a Comment