5.7.13

సగ్గుబియ్యం వడలు

సగ్గుబియ్యం వడలు

కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం -- 1 కప్పు
బియ్యంపిండి --1 కప్పు
శెనగపిండి -- 2 స్పూన్స్
పచ్చిమిర్చి పేస్టు -- 1 స్పూన్
జీలకర్ర పౌడర్ -- 1 స్పూన్
పెరుగు -- 1 కప్పు
ఉప్పు --- తగినంత
నూనె -- 1/4 కేజీ

తయారీ విధానం
2 గంటల ముందుగా సగ్గుబియ్యాన్ని పెరుగులో నానబెట్టుకోవాలి. బాగా ననిన తరవాత దానిలో బియ్యంపిండి, శెనగపిండి, పచ్చిమిర్చి పేస్టు, జీలకర్ర పౌడర్ & ఉప్పు వేసి, గారెల పిండిలాగా మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి, కాగాక, ఒక పాలకవరు మీదైనా, లేకుంటే చేతిమీదనైనా పిండిని తీసుకొని, గుండ్రంగా చేసి నూనెలో వేసుకొని, గోధుమరంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. మనకి నచ్చిన చెట్నీతో నంజుకొని తినొచ్చును. అంతే వేడి -- వేడి, కరకరలాడే కమ్మని సగ్గుబియ్యం వడలు రెడీ.(ఇష్టమైన వారు ఈ పిండిలో కొత్తిమీర కూడా వేసుకోవచ్చును)No comments:

Post a Comment