21.6.13

ఉల్లిదోశ

ఉల్లిదోశ

కావలసిన పదార్థాలు
మినప్పప్పు -- 2 కప్పులు 
బియ్యం --4 కప్పులు 
మెంతులు -- 1 స్పూన్
చిన్నగా (సన్నగా)తరిగిన ఉల్లిపాయల ముక్కలు -- 3 కప్పులు
పచ్చిమిరపకాయల ముక్కలు(చిన్నముక్కలు) -- 4 స్పూన్స్
జీలకర్ర -- 1స్పూన్
ఉప్పు -- తగినంత

తయారీవిధానం
ముందుగా మినప్పప్పు, బియ్యం & మెంతులు కలిపి 4 గంటలు నానబెట్టుకొని, రుబ్బి , ఉప్పు కలుపుకొని 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, పెనం (pan) పెట్టి, వేడి ఎక్కిన తరవాత పెనం మీద నూనె రాసి గరిటతో పిండిని గుండ్రంగా వేసి పైన తరిగిపెట్టుకున్న ఉల్లి, పచ్చిమిర్చి & జీలకర్ర జల్లుకోవాలి. దోరగా ఒకప్రక్కనే కాల్చుకొని తీసుకోవాలి. సన్నని మంటపై కాల్చుకోవాలి. అంతే నోరూరించే ఉల్లిదోశ రెడీ. ఈ దోశలని పుదీనా చట్నీ, అల్లం చట్నీలతో తింటే బావుంటుంది.



No comments:

Post a Comment