ఆలూ జంతికలు (మురుకులు)
కావలసిన పదార్థాలు
ఉడికించిన బంగాళదుంపలు (ఆలుగడ్డలు) - 3 కప్పులు (తొక్కతీసి ముద్దగా చేసి ఉంచుకోవాలి)
బియ్యం (వరి) పిండి - 1/2 కప్పు
వాము - 1 స్పూన్
కరం - 2 స్పూన్స్
ఉప్పు - తగినంత
నూనె - 1/4 Kg
తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి ..... నూనె కాగేలోపు ఉడికించిన దుంపలని తోక్కుతీసి ముద్దగా చేసుకొని అందులో పైన చెప్పిన పదార్థాలన్నిటినీ వేసి బాగా కలిపి జంతికల (మురుకుల) గొట్టంలో వేసి కాగిన నూనెలో వెయ్యాలి. బంగారు వర్ణంలో రెండువైపులా వేగిన తరవాత తియ్యాలి. అంతే కరకరలాడే ఎంతో రుచికరమైన ఆలూ జంతికలు(మురుకులు) రెడీ .....
* ఇష్టమైన వాళ్ళు శనగపిండిని వాడుకోవచ్చును. ఇవి ఆలూతో చేసినవి కనుక ఎక్కువరోజులు నిలువ ఉండవు. 1 లేదా 2 రోజులు మాత్రమే ఉంటాయి.*
No comments:
Post a Comment