సీతాఫలం జ్యూస్ / షేక్
పిల్లలని సీతఫలాలు తినమంటే చాలా విసుక్కుంటారు ..... ఏవైనా పండ్ల(Fruits)ను ముక్కలుగా కోసి ఇస్తేనే తినని పిల్లలు ఈ సీతాఫలాలను తినమంటే అస్సలు ముట్టుకోరు ..... అందుకని ఈ పండ్లను జ్యూస్ / షర్బత్ / షేక్ లాగా చేసి ఇస్తే నిమిషంలో గ్లాస్ ఖాళీ చేసి పక్కనపెడతారు..... మరి ఆ జ్యూస్ ని ఎలా తయారుచెయ్యాలో నేర్చుకుందాం.
కావలసిన పదార్థాలు
బాగా పండిన పెద్ద సీతాఫలం పండ్లు - 2
చల్లని పాలు - 2 కప్పులు (కాచి చల్లార్చిన పాలు)
పంచదార - 1 కప్పు
ఐస్ క్యూబ్స్ - 4
తయారీ విధానం
సీతాఫలాలు బాగా కడిగి పైన తొక్కలు కొంచెం తీసేస్తే స్పూనుతో లోపలి గుజ్జును అంతా తీసి ఒక చిన్న బౌల్ లో వేసుకోవాలి. గుజ్జును ఒక చిన్న స్పూనుతో మెదిపితే(కొడితే) ..... గుజ్జులోనుండి గింజలు బయటకు వచ్చేస్తాయి. ఆ వచ్చిన గుజ్జు, పాలు & పంచదారని కలిపి మిక్సీలో వేసి బాగా తిప్పిన తరవాత వచ్చిన జ్యూసుని ఒక గ్లాసులో పోసుకొని, ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవటమే అంతే సీతాఫలం జ్యూస్ / షేక్ రెడీ ..... మారాం చేసే పిల్లలు కూడా గప్ చుప్ గా చల్లగా గడగడా తాగేస్తారు. ఇంకెందుకు ఆలస్యం ..... మీరు ట్రై చేసి చూడండి.
No comments:
Post a Comment