వాటర్ మెలన్ రోజ్ పంచ్
కావలసిన పదార్థాలు
గింజలుతీసేసిన పుచ్చకాయ(Water melon) ముక్కలు - 2 కప్పులు
స్ట్రాబెర్రీలు - 2 (చిన్నచిన్న ముక్కలుగా చేసి ఉంచుకోవాలి)
రోజ్ వాటర్ - 4 స్పూన్స్
పంచదార - 3 స్పూన్స్
నిమ్మరసం - 1/2 స్పూన్
దాల్చినచెక్క - చిన్నముక్క
తయారీవిధానం
జ్యూసర్లో పుచ్చకాయ ముక్కలు, స్ట్రాబెర్రీ ముక్కలు, పంచదార, దాల్చినచెక్క వేసి మెత్తగా అయ్యేటట్టుగా మిక్సీ తిప్పాలి. ఇప్పుడు ఆ మిశ్రమంలో రోజ్ వాటర్ వేసి కలపాలి. చివరగా ఈ మిశ్రమానికి నిమ్మరసం కలిపి, ఐస్ క్యూబ్స్ వేసి, పుదీనా ఆకులతో అలంకరించి చల్లచల్లగా తాగాలి. తియ్యగా, ఎర్రగా ఎంతో ఆకర్షణీయంగా కనిపించే ఈ జ్యూసుని ఎవ్వరూ వద్దు అని అనరు. పిల్లలు - పెద్దలు అందరూ ఎంతో ఇష్టంతో తాగుతారు.
No comments:
Post a Comment