బంబాయి రవ్వ వడలు
కావలసిన పదార్థాలు
బొంబాయి రవ్వ - - 1 కప్పు
పెరుగు - 1 కప్పు
ఉల్లిపాయముక్కలు - 1/2 కప్పు
పచ్చిమిర్చి - 6(ముక్కలుచేసి ఉంచుకోవాలి)
కరివేపాకు - 5 రెబ్బలు
కొత్తిమీర తరుగు - 1/4 కప్పు
ఉప్పు - రుచికి సరిపడినంత
వంటషోడా - కొంచెంగా
నూనె - 1/4 కేజీ
తయారీవిధానం
ముందుగా రవ్వలొ పెరుగును వేసి రెండు గంటలు నానబెట్టాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నూనె వేసి మరిగించాలి. నూనె మరిగేలోపు నానబెట్టిన రవ్వ పిండిలో ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర తరుగు, ఉప్పు, వంటషోడా అన్నీ వేసి బాగా కలిపి చిన్నచిన్న వడలు లాగా ఒక కవరు పైన వత్తుకొని కాగిన నూనెలో వేసి, దోరగా రెండువైపులా బంగారు రంగు వచ్చేవరకు వేయించుకోవాలి. అంతే కరకరలాడే కమ్మటి బొంబాయి రవ్వ వడలు రెడీ .....ఈ వడలని టమాటా చట్నీ లేదా కొబ్బరి చెట్నీలతో తింటే చాలా బావుంటాయి.
No comments:
Post a Comment