మామిడి పండు జ్యూస్
కావలసిన పదార్థాలు
మామిడిపండు ముక్కలు - 1 కప్పు
బెల్లం తురుము లేదా పంచదార - 1 కప్పు
కుంకుమ పువ్వు - 1/4 స్పూన్
యాలకులపొడి - 1/2 స్పూన్
ఉప్పు - చిటికెడు
ఐస్ క్యూబ్స్ - 4
తయారీవిధానం
ముందుగా మామిడిపండు ముక్కలని బెల్లం తురుముతో కలిపి మిక్సీలో వేసి బాగా తిప్పాలి. ఒక గ్లాసులోకి ఈ జ్యూసుని తీసుకొని, అందులో యాలకులపొడి, కుంకుమపువ్వు వేసి కలిపి ఐస్ క్యూబ్స్ వేసుకొని తాగటమే..... ఈ వేసవికాలంలో మామిడిపళ్ళు ఎక్కువగా దొరుకుతాయి కాబట్టి ఈ జ్యూసుని ఈ కాలంలోనే చేసుకొని తాగాలి.
No comments:
Post a Comment