మెక్సికన్ సమ్మర్ డ్రింక్
కావలసిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
బాదం పప్పులు - 1/2 కప్పు
మంచినీరు - 5 కప్పులు
దాల్చినచెక్క - చిన్న (ఒక అంగుళం)ముక్క
నిమ్మ తొక్క - చిన్నది (పైతొక్క మాత్రమే తీసుకోవాలి)
ఐస్ క్యూబ్స్ - 5
తయారీవిధానం
డ్రింక్ తయారుచేసే 15 నిమిషాల ముందుగా బియ్యాన్ని , బాదాం పప్పులను నానబెట్టుకోవాలి. ముందుగా బియ్యాన్ని కడిగి, నీరు అంతా వంపి, మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. తరవాత పోట్టుతీసిన బాదాం ముక్కలను, దాల్చినచెక్క, నిమ్మతొక్క మిక్సీలో వేసి మెత్తగా పొడిలాగా చేసుకోవాలి. బియ్యంపిండిలో ఈ మిశ్రమాన్ని వేసి, 2 కప్పుల వేడినీళ్ళు పోసి, బాగా కలిపి ఒకరోజు రాత్రి అంతా నానబెట్టాలి.
మరుసటిరోజు ఉదయాన్నే ఈ నానిన మిశ్రమాన్ని మళ్ళీ మిక్సీలో వేసి ఒకసారి తిప్పాలి. తరవాత మరొక 2 కప్పుల మంచినీరు పోసి బాగా కలిపి, మళ్ళీ మరో 2 గంటలు నాననివ్వాలి. నానిన తరవాత ఈ మిశ్రమాన్ని పలుచని బట్టతో లేదా వలతో (నెట్) వడగట్టాలి. ఇప్పుడు వడగట్టగా వచ్చిన రసానికి 3 కప్పుల నీరు కలిపి, పంచదార వేసి, ఐస్ క్యూబ్స్ వేసుకుని చల్లచల్లగా తాగితే భలే మజాగా ఉంటుంది..... వేసవికాలంలో మెక్సికన్లు ఎక్కువగా ఇష్టపడి తాగే డ్రింక్ ఇదేనంట. అక్కడ ఈ డ్రింక్ కి ఎక్కువ డిమాండ్ ఉంటుందంట. ఇది ఎంతో ప్రాచీనకాలం నాటి పానీయం అని వారు చెబుతుంటారు.
No comments:
Post a Comment