చింతకాయ పులిహొర
కావలసిన పదార్థాలు:--
అన్నం-- 10 కప్పులు
చింతకాయలు -- 10
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
నూలుపొడి -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-4 ఇంగువ) కరివేపాకు
నూనె-- 100 గ్రాములు
తయారుచేయు విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, చింతకాయలని తరిగి, ఉడికించి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన బాణలి పెట్టి, నూనె వేసి, పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి, ఉడికించి పక్కన పెట్టుకున్న చింతకాయ గుజ్జుని వడకట్టి పోపులో వేసి వేయించి, వండి ఉంచుకున్న అన్నం పైన పోపుని వేసి ..... ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసుకొని కలుపుకోవాలి..అన్నీ అన్నానికి బాగా కలిసేలా చూసుకోవాలి.... చింతకాయ పులిహోర మీద నూలుపొడి వేసి కలుపుకోవాలి. అంతే పుల్లపుల్లని చింతకాయ పులిహొర రెడీ.....
No comments:
Post a Comment