ఉసిరికాయ పులిహొర
కావలసిన పదార్థాలు:--
అన్నం-- 4 కప్పులు
పెద్ద ఉసిరికాయలు -- 6 (సన్నగా కోరి ఉంచుకోవాలి)
పచ్చిమిర్చి-- 6
వేరుసెనగ గుళ్ళు--1 కప్పు
ఉప్పు--రుచికి తగినంత
పసుపు-- 1 స్పూన్
కరివేపాకు -- 4 రెబ్బలు
నూలుపొడి -- 1 కప్పు
జీడిపప్పు -- 1 కప్పు
పోపు దినుసులు(సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి-2, ఇంగువ) కరివేపాకు
నూనె-- 100 గ్రాములు
తయారుచేయు విధానం:--
ముందుగా ఒక పళ్ళెంలోకి అన్నం తీసుకొని, ఉప్పు, పసుపు, కొంచెం నూనె వేసుకొని.....కలుపుకోవాలి..ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి,నూనె వేసి పోపుదినుసులు, వేరుసెనగ గుళ్ళు, పచ్చిమిర్చి, జీడిపప్పు, కరివేపాకు వేసి, ఉసిరికాయల తరుగు(కోరు)ని కూడా వేసి వేయించి,.....అన్నం పైన వేసి కలుపుకోవాలి....పోపు అంతా అన్నానికి కలిసేలా కలుపుకోవాలి..... ఉసిరి పులిహోర మీద నూలుపొడి వేసి కలుపుకోవాలి. అంతే పుల్లపుల్లని ఉసిరికాయ పులిహొర రెడీ.....ఇష్టమైనవారు కొత్తిమీరని వేసుకోవచ్చును.
No comments:
Post a Comment