కూరగాయల అన్నం (Mixed Vegetable Rice)
కావలసిన పదార్థాలు:--
క్యారెట్ ముక్కలు -- 1/4 కప్పు
క్యాప్సికం ముక్కలు -- 1/4 కప్పు
టమాట ముక్కలు -- 1/4 కప్పు
పచ్చిబఠాణీ -- 1/4 కప్పు
వంకాయముక్కలు -- 1/4 కప్పు
బెండకాయ ముక్కలు -- 1/4 కప్పు
తీపిగుమ్మిడి ముక్కలు -- 1/4 కప్పు
కరివేపాకు & కొత్తిమీర -- కొద్దిగా
కందిపప్పు -- 1/2 కప్పు
బియ్యం -- 2 పావులు
చింతపండుగుజ్జు -- 1/4 కప్పు
పోపుదినుసులు -- తగినంత
ఉప్పు -- రుచికి సరిపడినంత
నూనె -- 1/4 కేజీ
తయారీవిధానం:--
ముందుగా బియ్యాన్ని కడిగి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నూనెవేసి, పోపుదినుసులు వేసి, వేగినతరవాత కూరగాయ ముక్కల్ని, కరివేపాకు & కొట్టిమీరని ఒక్కొక్కటిగా వేసి, కడిగిన కందిపప్పును, బియ్యాన్ని, తగినంత ఉప్పును, చింతపండుగుజ్జును వెయ్యాలి. అన్నీ వేసిన తరవాత బాగా కలియబెట్టి, 4 పావులు నీళ్ళు పోసి, మిగిలిన నూనెను వేసి, కుక్కరు మూతపెట్టి, 5 విసెల్స్ వచ్చేవరుకు ఉంచి దించుకోవాలి. అంతే రుచికరమైన కూరగాయల అన్నం రెడీ.
No comments:
Post a Comment