కొబ్బరి పాయసం
కావలసిన పదార్థాలు:--
పాలు -- 1/2 లీటరు
కొబ్బరి తురుము -- 1 కప్పు
యాలకుల పొడి -- 1/2 స్పూన్
పంచదార -- 1/4 కేజీ
కిస్ మిస్ -- 2 స్పూన్స్
జీడిపప్పు -- 3స్పూన్స్
బాదంపప్పు -- 2 స్పూన్స్
నెయ్యి -- 2 స్పూన్స్
సగ్గుబియ్యం -- 1/4 కప్పు (10 నిముషాలు ముందు ఉడికించి పక్కన పెట్టుకోవాలి)
తయారీ విధానం:--
ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్ మిస్ , బాదం పప్పు లను వేరువేరుగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో పాలుపోసి, బాగా మరిగిన తరవాత పంచదార వేసి.... అందులో కొబ్బరి తురుము, ముందుగా ఉడికించి పక్కనపెట్టుకున్న సగ్గుబియ్యం, అన్ని వేసి బాగా మరిగించి, దించేముందు యాలకులపొడిని వేసి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ పాయసంలో వేయించి పక్కన ఉంచుకున్న .. జీడిపప్పు, కిస్ మిస్, బాదంపప్పు వేసుకోవాలి. అంతే తియ్యని కమ్మని కొబ్బరి పాయసం రెడీ.
No comments:
Post a Comment