పొట్లకాయ తిమ్మనం
కావలసిన పదార్థాలు
బియ్యపు పిండి -- 3 స్పూన్స్
పొట్లకాయ ముక్కలు -- 1 కప్పు (ఉడికించినవి)
కొబ్బరి -- 4 స్పూన్స్
పాలు -- 1/2 లీటరు
పంచదార -- 1/4 కేజీ
జీడిపప్పు -- 50 గ్రా
కిస్ మిస్ -- 25 గ్రా
యాలకులపొడి -- 1 స్పూన్
నెయ్యి -- 2 స్పూన్స్
తయారీ విధానం:--
ముందుగా బియ్యంపిండిని, కొబ్బరిని మిక్సీలో మెత్తగా రుబ్బి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి గిన్నెలో పాలుపోసి మరిగించి, పంచదార వేసి పాలను బాగా మరిగించాలి. ఇప్పుడు రుబ్బి ఉంచుకున్న కొబ్బరి + బియ్యపుపిండి మిశ్రమాన్ని మరియు ఉడికించి ఉంచుకున్న పొట్లకాయ ముక్కలని వేసి సన్నటి సెగ మీద 10 నిముషాలు ఉడకనివ్వాలి. కొంచెం చిక్కబడే సమయానికి దించెయ్యాలి. ఇప్పుడు ఒక చిన్న బాణలిలో నెయ్యి వేసి... జీడిపప్పు + కిస్ మిస్ లను దోరగా వేయించి తిమ్మనంలో వేసుకుని, యాలకులపొడిని కూడా కలిపుకోవాలి. అంతే తియ్యటి తిమ్మనం రెడీ. ఈ తిమ్మనంలో అట్లను నంజుకొని తింటే చాలా బావుంటుంది.

No comments:
Post a Comment