వెలక్కాయ పచ్చడి
కావలిసిన పదార్థాలు
వెలక్కాయ గుజ్జు - 1 కప్పు
పచ్చి మిర్చి - 6
పసుపు - చిటికెడు
ఉప్పు - రుచికి సరిపడినంత
బెల్లం -1/4 కప్పు
కొత్తిమీర - 1 కట్ట
ఇంగువ - 1/4 స్పూన్
చింతపండు - చిన్న నిమ్మకాయంత
నూనె - పోపుకి సరిపడినంత
పోపు దినుసులు - మినప్పప్పు, శనగపప్పు, 2 ఎండుమిర్చి, ఆవాలు
తయారు చేయువిధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేడెక్కాక అందులో నూనె వేసి పోపు దినుసులను, ఇంగువను వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీలో పోపుని, ఉప్పు, పసుపు, చింతపండు, బెల్లం, కొత్తిమీర, పచ్చిమిర్చి అన్నీవేసి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమంలో వెలక్కాయ గుజ్జుని వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి(మిక్సీలో). అంతే కొంచెం కారముగా, కొంచెం వగరుగా , భలే రుచిగా ఉండే వెలక్కాయ పచ్చడి రెడీ. ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకు తింటే ఎంత బావుంటుందో. మీరు ట్రై చేస్తారు కదూ.
వెలక్కాయ పెరుగు పచ్చడి
ఒక బౌల్ లోకి రెండు గరిటెల పెరుగు తీసుకొని ఈ పచ్చడిని కలిపి ఈ మిశ్రమంలో కొద్దిగా మినప్పప్పు, ఆవాలు , ఒక ఎండు మిర్చి, రెండు కరివేపాకు రెబ్బలు, ఇంగువ పోపు వేసి కలుపుకుంటే వెలక్కాయ పెరుగు పచ్చడి రెడీ.
No comments:
Post a Comment