బూడిద గుమ్మడికాయ వడియాలు
కావలసిన పదార్థాలు
గుమ్మడికాయ - 1
మినప్పప్పు - 1/2 కేజీ
పండుమిర్చి - 200గ్రాములు
ఉప్పు - 1కప్పు (తగినంత)
ఇంగువ - 1 స్పూన్
కావలసిన పదార్థాలు
గుమ్మడికాయ - 1
మినప్పప్పు - 1/2 కేజీ
పండుమిర్చి - 200గ్రాములు
ఉప్పు - 1కప్పు (తగినంత)
ఇంగువ - 1 స్పూన్
తయారుచేయు విధానం
వడియాలు పెట్టే ముందురోజు రాత్రి మినప్పప్పుని నానబెట్టుకోవాలి. గుమ్మడికాయని చిన్నముక్కలుగా తరిగి, ఒక బట్టలో మూటకట్టి, దానిపై బరువును ఉంచి, నీరు పోయే విధంగా ఏటవాలుగా ఉంచాలి. పొద్దునకల్లా నీరు పోయి ముక్కలు పొడపొడలాడుతూ ఉంటాయి.
మినప్పప్పుని గట్టిగా అంటే గారెలకు(వడలకు) రుబ్బినట్టుగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బిన పిండిలో గుమ్మడికాయ ముక్కలు, ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న పండుమిర్చి ముద్ద, ఇంగువ, ఉప్పుని వేసి, బాగా కలిపి ఎండలో ఒక కవరు పైన చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి. మూడు రోజులు బాగా ఎండబెట్టిన తరవాత ఒక సీసాలో నిల్వ ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చును. ఇవి అన్నంలో తినొచ్చు. కొన్ని కొన్ని కూరలలో కూడా వాడుకోవచ్చును. ఇవి ఏడాదంతా నిల్వ ఉంటాయి.
(వడియాలముద్దలో ఎండు కారం వేసుకోవచ్చును, అలా వేస్తే వడియాలు గుల్లగా ఉండవు, గట్టిగా వస్తాయి, అందుకే పండుమిర్చిని వాడితే చూడటానికి రంగు బావుంటుంది, తినటానికి రుచిగా ఉంటాయి.)
మినప్పప్పుని గట్టిగా అంటే గారెలకు(వడలకు) రుబ్బినట్టుగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బిన పిండిలో గుమ్మడికాయ ముక్కలు, ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న పండుమిర్చి ముద్ద, ఇంగువ, ఉప్పుని వేసి, బాగా కలిపి ఎండలో ఒక కవరు పైన చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి. మూడు రోజులు బాగా ఎండబెట్టిన తరవాత ఒక సీసాలో నిల్వ ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చును. ఇవి అన్నంలో తినొచ్చు. కొన్ని కొన్ని కూరలలో కూడా వాడుకోవచ్చును. ఇవి ఏడాదంతా నిల్వ ఉంటాయి.
No comments:
Post a Comment