కాశ్మీరీ పలావు
కావలసిన పదార్థాలు
పలావు బియ్యం - 1/2 కేజీ
ఉల్లిపాయముక్కలు - 1 కప్పు
నెయ్యి - 3 స్పూన్స్
పచ్చిమిర్చి ముక్కలు - 1/2 కప్పు
గరం మసాలా - 1 స్పూను
పుదీనా ఆకులు - 1/2 కప్పు
జీడిపప్పు - 1/2 కప్పు
డ్రై చెర్రీ - 10
టుటీ ప్రూట్ - 15 గ్రామ్స్
కుంకుమ పువ్వు - 1/4 గ్రామ్
పాలు - 1/2 కప్పు
అరటిపండు - 1
అల్లంవెల్లుల్లి పేస్టు - 1 స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
కావలసిన పదార్థాలు
పలావు బియ్యం - 1/2 కేజీ
ఉల్లిపాయముక్కలు - 1 కప్పు
నెయ్యి - 3 స్పూన్స్
పచ్చిమిర్చి ముక్కలు - 1/2 కప్పు
గరం మసాలా - 1 స్పూను
పుదీనా ఆకులు - 1/2 కప్పు
జీడిపప్పు - 1/2 కప్పు
డ్రై చెర్రీ - 10
టుటీ ప్రూట్ - 15 గ్రామ్స్
కుంకుమ పువ్వు - 1/4 గ్రామ్
పాలు - 1/2 కప్పు
అరటిపండు - 1
అల్లంవెల్లుల్లి పేస్టు - 1 స్పూన్
ఉప్పు - రుచికి తగినంత
తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాలల్లో కుంకుమపువ్వు వేసి నానబెట్టి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసి, ఉల్లిపాయముక్కలని పచ్చి వాసన పోయేవరకు వేయించుకొని, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, గరం మసాలా, ఉప్పు ,అన్నీ వేసి బాగా కలిపి వేయించాక, ఆ మిశ్రమంలో ఒక లీటరు నీళ్ళు పోసి, నీటిని బాగా మసలనియ్యాలి. నీరు మసిలి, పొంగుతున్న సమయంలో ముందుగా కడిగి పక్కన పెట్టుకొన్న బియ్యాన్ని వేసి కలియబెట్టి మూతపెట్టి ఉడికించుకోవాలి. అన్నం మూడువంతులు ఉడకగానే, కుంకుమపువ్వు నానబెట్టిన పాలుపోసి, సన్నని మంటమీద ఉడికించాలి. బిరియానీ అంతా బాగా ఉడికిన తరవాత దానిపైన పుదీనా ఆకులని జల్లాలి. పైన జీడిపప్పు, డ్రై చెర్రీ, టుటీ ప్రూట్, అరటిపండు ముక్కలు వేసి కలపాలి. అంతే .... ఎంతో రుచికరమైన కమ్మని కాశ్మీరీ పలావు రెడీ. ఈ పలావుని కూరలేకుండా ఐనా తినొచ్చును, లేదా ఏదైనా మసాలా కూరతో ఐనా తినొచ్చును.
No comments:
Post a Comment