11.12.16

బియ్యం రవ్వ (వరినూక) ఉప్మా

బియ్యం రవ్వ (వరినూక) ఉప్మా 

కావలసిన పదార్థాలు 
బియ్యం రవ్వ - 1 కప్పు (బియ్యం సన్నగా రవ్వలాగా మరపట్టించి ఉంచుకోవాలి)  
పెసరపప్పు - 1 స్పూన్ 
ఆవాలు - 1/4 స్పూన్ 
జీలకర్ర - 1/2 స్పూన్ 
అల్లం - చిన్న ముక్క (సన్నగా చిన్నముక్కలుగా తరిగి ఉంచుకోవాలి)
పచ్చిమిర్చి - 2 (చిన్నముక్కలుగా తరిగి ఉంచుకోవాలి)
ఎండుమిర్చి - 2 (చిన్నముక్కలుగా తుంపి ఉంచుకోవాలి)  
కరివేపాకు - 2 రెబ్బలు 
ఉప్పు - రుచికి సరిపడా 
నూనె - 6 స్పూన్స్
నీరు - 2 కప్పులు  

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి బాణలి పెట్టి 2 స్పూన్స్ నూనె వేసి ఆవాలు వేసి చిటపటలాడాక పెసరపప్పు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కరివేపాకు అన్నీ వేసి బాగా వేగిన తరవాత 2 కప్పుల నీళ్ళు పోసి, తగినంత ఉప్పువేసి, మూతపెట్టి ఉంచాలి. నీళ్ళు బాగా మసిలిన తరవాత స్టవ్ మంట తగ్గించి, రవ్వని పోస్తూ గరిటతో తిప్పుతూ ఉండాలి. అలా తిప్పకపోతే రవ్వ ఉండలు కట్టేస్తుంది. అంతా బాగా కలిసాక 5 నిమిషాల వరకు అలాగే స్టవ్ పైనే ఉంచి తరవాత స్టవ్ ఆపెయ్యాలి. స్టవ్ ఆపిన తరవాత కూడా 10 నిమిషాల తరవాత కొబ్బరి చట్నీతో వేడివేడిగా తినాలి. అంతే కమ్మటి బియ్యంరవ్వ ఉప్మా రెడీ.   

 
                 

అటుకుల చుడవా (మిక్చరు)

అటుకుల చుడవా (మిక్చరు)

కావలసిన పదార్థాలు 
పేపర్ అటుకులు - 2 కప్పులు  
(వేరుశనక్కాయలు) పల్లీలు - 1/2 కప్పు 
పుట్నాల (చట్నీ)పప్పు - 1/2 కప్పు 
పోపుదినుసులు - ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, 
పచ్చిమిర్చి(నిలువుగా చీల్చుకొని ఉంచుకోవాలి) - 6
పసుపు - చిటికెడు 
ఉప్పు - రుచికి సరిపడినంత 
నూనె - 6 స్పూన్స్ 
కరివేపాకు - 4 రెబ్బలు 

తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, అది వేడెక్కాక, ముందుగా బాగుచేసుకొని ఉంచుకున్న అటుకులని వేసి గోధుమరంగు వచ్చేవరకు వేయించి, పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు అదే బాణలిలో 2 స్పూన్స్ నూనె వేసుకొని, పల్లీలు & పుట్నాలపప్పు వేసి వేయించుకోవాలి, కొద్దిగా దోరగా వేగిన తరవాత పోపుదినుసులు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి వెయ్యాలి, పోపు చిటపటలాడాక కరివేపాకు, ఉప్పు, పసుపు వెయ్యాలి. పోపు సామాను అన్నీ బాగా వేగిన తరవాత ముందుగా వేయించి పక్కన ఉంచుకున్న అటుకులని కూడా వేసి బాగా కలుపుకోవాలి. అటుకులకి మిశ్రమం అంతా బాగా కలవటం కోసం 2 స్పూన్స్ నూనె వెయ్యాలి. అంతే చాలా రుచిగా క్రిస్పీగా ఉండే అటుకుల చుడవా (మిక్చరు) తయారైపోయింది. చాలా సులువుగా, అతి తక్కువ సమయంలో ఈ చుడవాని చేసుకోవచ్చును. ఈ మిశ్రమంలో కొద్దిగా నిమ్మరసం వేసుకుంటే బావుంటుంది. ఇష్టమైనవారు వేసుకోవచ్చును, వేసుకోకపోయినా బాగానే ఉంటుంది.       


4.11.16

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు....... My Slideshow

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు....... My Slideshow

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు ........ మాటిమాటికి పుండ్లు/ చర్మవ్యాధి/ రక్తశుద్ధి

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు ........ మాటిమాటికి పుండ్లు/ చర్మవ్యాధి/ రక్తశుద్ధి 

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... శరీరం లావుగా బరువుగా అయ్యి నీరు పట్టినట్లయితే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు....  శరీరం లావుగా బరువుగా అయ్యి  నీరు పట్టినట్లయితే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... అమీబియాసిస్

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు....  అమీబియాసిస్

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... మీకు గ్యాసు ఎక్కువగా ఉందా ?

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... మీకు గ్యాసు ఎక్కువగా ఉందా ?

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... ఎసిడిటిగా ఉంటే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... ఎసిడిటిగా ఉంటే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... చర్మవ్యాధులు/ రాషెస్/ ఎలర్జీ

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... చర్మవ్యాధులు/ రాషెస్/ ఎలర్జీ

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... థైరాయిడ్

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు....  థైరాయిడ్

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... పార్శ్వ తలనొప్పి - మైగ్రేన్ తలనొప్పి తగ్గాలంటే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... పార్శ్వ తలనొప్పి - మైగ్రేన్ తలనొప్పి తగ్గాలంటే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... అల్సర్ - పేగు పూత

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... అల్సర్ - పేగు పూత

3.11.16

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... గుండెపోటు రాకుండా ఉండాలంటే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.... గుండెపోటు రాకుండా ఉండాలంటే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు...... శ్వాస సంబంధ వ్యాధులు

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు...... శ్వాస సంబంధ వ్యాధులు

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.....కిడ్నీలో రాళ్ళు కరగాలంటే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.....కిడ్నీలో రాళ్ళు కరగాలంటే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు......రక్త విరేచనాలు

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు......రక్త విరేచనాలు

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.......తెలియకుండా పక్క తడిపితే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.......తెలియకుండా పక్క తడిపితే

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు......నోటిపూత

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు......నోటిపూత

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.......శక్తికి - బలానికి

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు.......శక్తికి - బలానికి

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు ...... రేచీకటి

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు ...... రేచీకటి

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు...... దగ్గు, ఆయాసం

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు ......  దగ్గు, ఆయాసం

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు ....... రక్తపోటు -- (HI Bp)

కొన్ని ప్రకృతి ఆయుర్వేద చిట్కాలు .......... రక్తపోటు -- (HI Bp)







27.1.16

బూడిద గుమ్మడికాయ వడియాలు

బూడిద గుమ్మడికాయ వడియాలు 


కావలసిన పదార్థాలు 
గుమ్మడికాయ - 1
మినప్పప్పు - 1/2 కేజీ
పండుమిర్చి - 200గ్రాములు
ఉప్పు - 1కప్పు (తగినంత)
ఇంగువ - 1 స్పూన్

తయారుచేయు విధానం 
వడియాలు పెట్టే ముందురోజు రాత్రి మినప్పప్పుని నానబెట్టుకోవాలి. గుమ్మడికాయని చిన్నముక్కలుగా తరిగి, ఒక బట్టలో మూటకట్టి, దానిపై బరువును ఉంచి, నీరు పోయే విధంగా ఏటవాలుగా ఉంచాలి. పొద్దునకల్లా నీరు పోయి ముక్కలు పొడపొడలాడుతూ ఉంటాయి.

మినప్పప్పుని గట్టిగా అంటే గారెలకు(వడలకు) రుబ్బినట్టుగా రుబ్బుకోవాలి. ఆ రుబ్బిన పిండిలో గుమ్మడికాయ ముక్కలు,  ముందుగా మిక్సీ చేసి ఉంచుకున్న పండుమిర్చి ముద్ద, ఇంగువ, ఉప్పుని వేసి, బాగా కలిపి ఎండలో ఒక కవరు పైన చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి. మూడు రోజులు బాగా ఎండబెట్టిన తరవాత ఒక సీసాలో నిల్వ ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చును. ఇవి అన్నంలో తినొచ్చు. కొన్ని కొన్ని  కూరలలో కూడా వాడుకోవచ్చును. ఇవి ఏడాదంతా నిల్వ ఉంటాయి.

(వడియాలముద్దలో ఎండు కారం వేసుకోవచ్చును, అలా వేస్తే వడియాలు గుల్లగా ఉండవు, గట్టిగా వస్తాయి, అందుకే పండుమిర్చిని వాడితే చూడటానికి రంగు బావుంటుంది, తినటానికి రుచిగా ఉంటాయి.)   
                   

26.1.16

టమాట నిల్వ పచ్చడి

టమాట నిల్వ పచ్చడి 

కావలసిన పదార్థాలు 
టమాటాలు  - 5 కేజీలు 
(బాగా పెద్దవి, కొన్ని పచ్చివి, కొన్ని పండువి)   
చింతపండు - 1/2 కేజీ 
ఉప్పు - 3/4 కేజీ 
పసుపు - 5 స్పూన్స్ 
ఇంగువ - 2 స్పూన్స్ 
నూనె - 1 కేజీ 
ఆవాలు - 1 కప్పు 
కారం - 1 కేజీ 
మెంతిపొడి - 3 స్పూన్స్ 
(మెంతులను గోధుమ రంగు వచ్చేవరకు బాగా వేయించి, చల్లారిన తరవాత మెత్తగా పొడిచేసి ఒక గాజుసీసాలో ఉంచుకోవాలి)   

తయారుచేయు పద్ధతి 
ముందుగా టమాటాలను బాగా కడిగి ఆరబెట్టాలి. ఆరిన తరువాత వాటిని ముక్కలుగా కోసి ఒక ప్లాస్టిక్ టబ్బులో వెయ్యాలి. ఆ ముక్కలలో  ఉప్పు, పసుపు వేసి, బాగా కలిపి మూడు రోజుల పాటు కదపకుండా పక్కన ఉంచుకోవాలి. అప్పుడు ముక్కలను బాగా పిండి, ఊట, ముక్కలను వేరు - వేరు చెయ్యాలి. ముక్కలు బాగా పొడిపొడిగా అయ్యేవరకు ఎండబెట్టాలి. ఊటలో చింతపండుని వేసి నానబెట్టాలి. ప్రతీరోజూ ఊటని, ముక్కలని బాగా ఎండబెట్టాలి. ఊట చిక్కబడాలి, ముక్కలు గలగలలాడుతూ ఉండాలి. అంతవరకూ ఎండబెట్టాలి. ముక్కలు బాగా ఎండిన తరవాత ఊటలో వేసి బాగా కలిపి మళ్ళీ ఊట మొత్తం చిక్కబడేటట్లు ఎండబెట్టాలి. అంతే ... ఇప్పుడు ఈ మిశ్రమాన్ని రోటిలో బాగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి. 





ఈ మిశ్రమంలో మెంతిపొడిని వేసి బాగా కలిపి, ఒక తడిలేని జాడీ, లేదా గాజుసీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఇప్పుడు టమాటా నిల్వ పచ్చడి తయారయ్యింది. 





కొంచెం పచ్చడి మిశ్రమాన్ని ఒక బౌల్ లోకి తీసుకొని, దానికి తగినంత కారం గుండ కలుపుకొని, ఎండుమిర్చి, ఆవాలు, ఇంగువ వేసి పోపు పెట్టుకొని, వేడి -వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే .......... ఆహా ఏమి రుచి అని ఎవ్వరైనా అనక మానరు. 

(పచ్చడి పూర్తి అయ్యాక ఇష్టమున్నవారు మొత్తం పచ్చడిలో ఒకేసారి పోపు వేసుకోవచ్చు, లేకుంటే ఎప్పటికప్పుడు కొంచెం-కొంచెం పచ్చడిలో పోపు వేసుకోవచ్చు.)                      

17.1.16

కాశ్మీరీ పలావు

కాశ్మీరీ పలావు 


కావలసిన పదార్థాలు 
పలావు బియ్యం - 1/2 కేజీ
ఉల్లిపాయముక్కలు - 1 కప్పు
నెయ్యి - 3 స్పూన్స్
పచ్చిమిర్చి ముక్కలు - 1/2 కప్పు
గరం మసాలా - 1 స్పూను
పుదీనా ఆకులు - 1/2 కప్పు
జీడిపప్పు - 1/2 కప్పు
డ్రై చెర్రీ - 10
టుటీ  ప్రూట్ - 15 గ్రామ్స్
కుంకుమ పువ్వు - 1/4 గ్రామ్
పాలు - 1/2 కప్పు
అరటిపండు - 1
అల్లంవెల్లుల్లి  పేస్టు - 1 స్పూన్
ఉప్పు - రుచికి తగినంత

తయారీ విధానం 
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. పాలల్లో కుంకుమపువ్వు వేసి నానబెట్టి పక్కనపెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ప్రెషర్ కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసి, ఉల్లిపాయముక్కలని పచ్చి వాసన పోయేవరకు వేయించుకొని, అల్లంవెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, గరం మసాలా, ఉప్పు ,అన్నీ వేసి బాగా కలిపి వేయించాక, ఆ మిశ్రమంలో ఒక లీటరు నీళ్ళు పోసి, నీటిని బాగా మసలనియ్యాలి. నీరు మసిలి, పొంగుతున్న సమయంలో ముందుగా కడిగి పక్కన పెట్టుకొన్న బియ్యాన్ని వేసి కలియబెట్టి మూతపెట్టి ఉడికించుకోవాలి. అన్నం మూడువంతులు ఉడకగానే, కుంకుమపువ్వు నానబెట్టిన పాలుపోసి, సన్నని మంటమీద ఉడికించాలి. బిరియానీ అంతా బాగా ఉడికిన తరవాత దానిపైన పుదీనా ఆకులని జల్లాలి. పైన జీడిపప్పు, డ్రై చెర్రీ, టుటీ  ప్రూట్, అరటిపండు ముక్కలు వేసి కలపాలి. అంతే .... ఎంతో  రుచికరమైన కమ్మని కాశ్మీరీ పలావు రెడీ. ఈ పలావుని కూరలేకుండా ఐనా తినొచ్చును, లేదా  ఏదైనా మసాలా కూరతో ఐనా తినొచ్చును.