పూర్ణం బూరెలు
కావలసిన పదార్థాలు
శెనగపప్పు -- 2 కప్పులు
పంచదార - 2 కప్పులు
ఏలకుల పొడి - 2 స్పూన్స్
తోపుపిండి - 1 కప్పు మినప్పప్పు & 3 కప్పులు బియ్యం 3 గంటల ముందుగా నానబెట్టి దోసెల పిండిలాగా రుబ్బి ఉంచుకోవాలి.
నూనె - 1/2 కేజీ (బూరెలు నూనెలో మునిగే అంత)
తయారీవిధానం
ముందుగా స్టవ్ వెలిగించి శెనగపప్పును కుక్కర్లో బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి. కుక్కరు వెయిట్ తీసిన తరవాత పప్పులో పంచదార కలిపాలి. పంచదార కలిపగానే పప్పు జారుగా అంటే పలచగా అవుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక మందపాటి గిన్నెలో ఈ మిశ్రమాన్ని వేసి, సన్నని మంటపై మిశ్రమం అడుగంటకుండా గరిటతో తిప్పుతూ ఉండాలి. మిశ్రమం గట్టిబడ్డాక, (దగ్గరగా అయిన తరవాత) దించి పక్కన ఉంచుకోవాలి. మిశ్రమం చల్లారిన తరవాత ఉండలుగా అదేనండి పూర్ణాలుగా చుట్టి పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, నూనె పోసి కాగాక ఒక్కొక్క పూర్ణాన్ని తోపుపిండిలో ముంచి నూనెలో వేసి, బంగారురంగు వచ్చేవరకు వేయించి తీసుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన సాంప్రదాయపు పిండివంట పూర్ణం బూరెలు రెడీ.

vandi petav anukunte... vandadame nerpustunnavakkka :)
ReplyDeleteHahahahaha
Delete