క్యాబేజీ ఆవకూర
కావలసిన పదార్థాలు:-
క్యాబేజీ - 1/4 కేజీ (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
పోపు సామాను - కొంచెముగా
కరివేపాకు - 3 రెబ్బలు
ఉప్పు - రుచికి తగినంత
పసుపు - చిటికెడు
ఇంగువ - చిటికెడు
చింతపండు - నిమ్మకాయంత
ఆవముద్ద --
(ఆవముద్ద తయారుచేయు విధానం ...... 2 స్పూన్స్ శెనగపప్పు, 3 స్పూన్స్ నూలుపప్పు, 2 స్పూన్స్ ఆవాలు , 3 పచ్చిమిర్చి ..... ఇవి అన్నీ కలిపి 1 గంట నానపెట్టి, రుబ్బుకుంటే ఆవముద్ద రెడీ అవుతుంది.)
తయారీ విధానం:-
ముందుగా స్టవ్ వెలిగించి, సన్నగా తరిగి ఉంచుకున్న క్యాబేజీని 10 నిముషాలు ఉడికించి, నీరు వంపి, పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాణలిలో పోపుకి సరిపడినంత నూనె వేసి కాగాక పోపుదినిసులు, కరివేపాకు, ఇంగువ వేసి, పోపు చిటపటలాడాక, ఉడికించి పక్కన పెట్టుకున్న క్యా బేజీని వేసి, అందులో రుచికి సరిపడినంత ఉప్పు, చిటికెడు పసుపు, చింతపండు రసం(చింతపండు పులుసు) వేసి, ఒకసారి కలియబెట్టాలి. చివరిలో కూరని దింపే ముందు, ఆవముద్ద - కొంచెంగా నూనె వేసి కలపాలి...... దించి వేరే డిష్ లోకి తీసుకోవాలి. అంతే కమ్మటి క్యాబేజీ ఆవపెట్టిన కూర రెడీ.

No comments:
Post a Comment