బ్రెడ్ ఛాట్
కావలసిన పదార్థాలు
బ్రెడ్ -- 1 ప్యాకెట్
పచ్చిబఠాణీ -- 1 కప్పు (ఉడికించినవి)
బంగాళదుంప ముక్కలు -- 1 కప్పు (ఉడికించినవి)
టమాట ముక్కలు -- 1/2 కప్పు
ఉల్లిపాయముక్కలు -- 1 కప్పు (సన్నగా తరిగి ఉంచుకోవాలి)
కొత్తిమీర -- (సన్నగా తరిగాలి) 2 స్పూన్స్
కారం & ఉప్పు -- తగినంత
పసుపు -- చిటికెడు
ఛాట్ మసాలా -- 1 స్పూన్
సన్న కారప్పూస -- 1 కప్పు
చింతపండు గుజ్జు -- 1 స్పూన్
నూనె -- కొంచెం
తయారీ విధానం
ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, కొంచెంగా నూనె వేసి ఉడికించి పక్కన పెట్టుకున్న బఠాణీలను వేసి, అందులో ఉప్పు, కారం, చిటికెడు పసుపు, చింతపండుగుజ్జు, వేసి కలపాలి. తగినంత నీరు పోసి చిక్కగా అయ్యేవరకు ఉడికించి పక్కనపెట్టుకోవాలి.
వేరే ఒక డిష్ లో సన్నగా తరిగిన ఉల్లిపాయముక్కలను, టమాటా ముక్కలను, కొత్తిమీర తురుమును వేసి, కలిపి ఉంచుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి, సన్నని మంట మీద పెనం పెట్టి, ఒక్కొక్క బ్రెడ్ ముక్కని దోరగా, కరకరలాడే లాగా అన్ని ముక్కల్ని కాల్చుకొని, ఒక ప్లేట్ లో అమర్చుకొని, ఆ ముక్కలమీద బఠానీ కూర వేసి, ఉల్లిముక్కల మిశ్రమం ఆ పైన కారప్పూస చల్లుకోవాలి. అంతే కమ్మని రుచికరమైన బ్రెడ్ ఛాట్ రెడీ. ఇది చెయ్యటం సులువు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. (ఇష్టమైతే మామిడికాయని సన్నగా తురుములాగా చేసుకొని పైన వేసుకోవచ్చును.)

No comments:
Post a Comment