11.2.13

కందిపొడి

కందిపొడి


కావలసిన సామగ్రి:-

1 గ్లాసు కందిపప్పు 
1 గ్లాసు శెనగపప్పు 
1/2 గ్లాసు పెసరపప్పు 
20 ఎండుమిరపకాయలు 
ఉప్పు 3 చెమ్చాలు(తగినంత)
1 చెమ్చా జీలకర్ర
10 వెల్లుల్లి రేకులు
ఇంగువ కొంచెం

తయారుచేయు విధానం:-

పప్పులు విడివిడిగా నూనె వెయ్యకుండా బాణలిలో వేయించి పక్కన పెట్టుకోవాలి. ఎండుమిర్చి కూడా పప్పుల్లో వేసి కదిపితే ఆ వేడికి మిర్చి పచిదనం పోతుంది. పప్పులు అన్ని చల్లారిన తరవాత మిక్సీ లో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.ఆఖరి నిమిషం లో జీలకర్ర,ఇంగువ,వెల్లుల్లి,ఉప్పు వేసి మరొక్కసారి తిప్పాలి.అంతే కమ్మ కమ్మని కంది పొడి రెడీ......



పెసరపొడి



కావలసిన సామగ్రి:-

1 గ్లాసు పెసరపప్పు 
6 ఎండుమిరపకాయలు 
4 వెల్లుల్లి రేకులు 
కొంచం జీలకర్ర 
తగినంత ఉప్పు

తయారుచేయు విధానం:-


పెసరపప్పును బాగా ఎండబెట్టి, ఎందలోనుండి తీసి, వేడిగా ఉన్నప్పుడే మిక్సీ చెయ్యాలి.చివరగా జేలకర్ర,ఉప్పు,ఇంగువ,ఎండుమిర్చి,వెల్లుల్లి వేసి తిప్పాలి.అంతే కమ్మకమ్మని పెసరపొడి రెడీ. వేడి వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని తినేయ్యటమే....

నువ్వులపొడి




కావలసిన సామగ్రి:-

1 గ్లాసు నువ్వులపప్పు 
10 ఎండుమిరపకాయలు 
6 వెల్లుల్లి రేకులు 
జీలకర్ర కొంచెంగా 
తగినంత ఉప్పు

తయారుచేయు విధానం:-


ముందుగా స్టవ్ వెలిగించి బాణలిపెట్టి, నునె వెయ్యకుండా నువ్వులపప్పుని కమ్మని వాసన వచ్చేవరకు వేయించాలి. చల్లారిన తరవాత మిక్సీలో వేసి పొడి చెయ్యాలి. ఆఖరి నిమిషంలో జేలకర్ర,వెల్లుల్లి,ఎండుమిర్చి,ఉప్పు వేసి మరొక్కసారి మెత్తగా చెయ్యాలి.అంతే కమ్మని నువ్వులపొడి రెడీ.వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బావుంటుంది.....

చారుపొడి




కావలసిన సామగ్రి:-

1 గ్లాస్ కందిపప్పు 
1 గ్లాస్ ధనియాలు 
1/2 గ్లాస్ మిరియాలు 
1/4 గ్లాస్ జీలకర్ర 
10 ఎండుమిరపకాయలు

తయారుచేయు విధానం:-


అన్ని సామాన్లు కలిపి ఒక పళ్ళెంలో పోసి,ఒకరోజంతా ఎండలో పెట్టి,తీసాక వేడి ఉండగానే, మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి.(ఎండలోపెట్టుకోవటానికి అవకాశము లేనివారు చారుపొడి సమాన్లుని స్టవ్ పైన బాణలిలో వేడిచేసుకొని ఆ వేడి మీదే మిక్సీ చేసుకోవాలి).......అంతే చారుపొడి సిద్దమే...



మెంతిపొడి



కావలసిన సామగ్రి:-

1 గ్లాస్ సెనగపప్పు 
1 గ్లాస్ మినప్పప్పు 
1/4 గ్లాస్ ధనియాలు 
2 స్పూన్స్ మెంతులు 
1 స్పూన్ జీలకర్ర
25 ఎండుమిరపకాయలు

తయారుచేయు విధానం:-


ముందుగా స్టవ్ వెలిగించి, బాణలి పెట్టి, ఒకొక్క సామానుని వేటికవి దోరగా వేయించి(మాడిపోకుండా) చల్లారిన తరవాత అన్ని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి....అంతే మెంతిపొడి రెడీ..........ఈ పొడిని కొన్ని రకాల పులుసు పెట్టిన కూరలలో వేసుకోవచ్చును.......సాంబారు & ముక్కల పులుసులలో కూడా ఈ పొడిని వేసుకోవచ్చును....

కూరపొడి



కావలసిన సామగ్రి:-

1 గ్లాస్ పుట్నాలపప్పు(చెట్నిపప్పు )
1 గ్లాస్ సెనగపప్పు 
1 గ్లాస్ వేరుసెనగ గుళ్ళు(పప్పు)
20 ఎండుమిరపకాయలు 
10 వెల్లుల్లి రేకులు
1 స్పూన్ జీలకర్ర

తయారుచేయు విధానం:-


ముందుగ స్టవ్ వెలిగించి బాణలి పెట్టి వేటికవి విడివిడిగా దోరగా వేయించి పెట్టుకోవాలి..చల్లారిన తరవాత అన్ని కలిపి మిక్సీలో వేసి మెత్తగా పొడి చేసుకోవాలి......అంతే కమ్మని కూరపొడి రెడీ......ఈ పొడిని అన్ని రకాలైన వేపుడు కూరలలో వేసుకోవచ్చును...చాలా రుచికరంగా ఉంటుంది....



గుత్తి వంకాయ మసాలకూర

గుత్తి వంకాయ మసాలకూర

కావలసిన సామగ్రి
1/2 కేజీ నీటి వంకాయలు 
3 ఉల్లిపాయలు 
చిన్న అల్లం ముక్క
2 స్పూన్స్ ధనియాలు
1/2 చిప్ప కొబ్బరిముక్క
1 స్పూన్ గసగసాలు
పెద్ద నిమ్మకాయంత చింతపండు
ఉప్పు తగినంత
1/2 స్పూన్ జీలకర్ర
చిటికెడు పసుపు
తగినంత నూనె
1 స్పూన్ పొడికారం
2 యాలకులు 


(పోపు సామగ్రి: సెనగపప్పు,మినపప్పు,ఆవాలు,ఎండుమిరపకాయలు,కరివేపాకు,కొత్తిమీర)
(వంకాయలు తప్పించి మిగిలిన సామాన్లు అన్ని కలిపి మిక్సీలో వేసి మసాలా ముద్దని సిద్దంగా ఉంచుకోవాలి)

తయారుచేయు విధానం


వంకాయలని 4 చీలికలుగా చేసుకోవాలి(కాని కాయ విడిపోకుండ గుత్తి విడకండ చూసుకోవాలి ).ముందుగ స్టవ్ వెలిగించుకుని బాణలి పెట్టి వంకాయలు వేసి చింతపండు రసాన్ని వేసి ఉప్పు పసుపు వేసి కొద్ది సేపు ఉడికించాలి.పూర్తిగా వంకాయలు మెత్తబడకూడదు.ఉడికిన తరవాత చింతపండు నీటిని వంపి కాయల్ని పక్కన వేరే డిష్ లో ఉంచాలి......ఇప్పుడు బాణలిలో కొంచం ఎక్కువగా నూనెవేసి, పోపు దినుసులు వేసి, ముందుగా సిద్దంగా ఉంచుకున్న మసాలా ముద్దని పోపు వేగిన తరవాత వేసి.........మసాలా యొక్క పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న గుట్టివంకాయల్ని వేసుకోవాలి.......ఇప్పుడు ఒక గ్లాసుడు నీరు పోసి,పొడి కారము వేసుకొని కూర దగ్గరయ్యేంతవరకు ఉంచి స్టవ్ మీద నుండి దించుకోవటమే.......అంతే.......ఘుమఘుమలాడే గుత్తివంకాయ మసాలా కూర రెడీ..........




కాకరకాయ పులుసు బెల్లం కూర





తయారుచేయటానికి కావలసిన పదార్థాలు:-

1/4 కిలో కాకరకాయలు 
చిన్న నిమ్మకాయంత చింతపండు 
రుచికి సరిపడా ఉప్పు
పెద్ద స్పూన్ పొడి కారం
చిటికెడు పసుపు
చిన్న బెల్లం ముక్క
నూనె
పోపు దినుసులు
కరివేపాకు

తయారుచేయు విధానం:-


ముందుగా కాకరకాయలు శుభ్రంగా కడిగి, చక్రాలుగా తరిగి, స్టవ్ వెలిగించి, బాణలిలో వేసి, ఆ ముక్కలలో చింతపండు రసం వేసి చిటెకెడు పసుపు, తగినంత ఉప్పు వేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి. బాణలి పెట్టుకుని, నూనె వేసి,పోపుకు సరిపడా మినప్పప్పు, 5 ఎండుమిరపకాయలు,కొద్దిగా ఆవాలు,
వేసి వేగాక, ఉడికించి పక్కన పెట్టుకున్న కాకర చక్రాలను పోపులో వెయ్యాలి.కాకర ముక్కల్ని కదుపుతూ ముందుగ తురిమి ఉంచుకున్న బెల్లం తురుము,పోడికారము వేసి కదుపుతూ 5 నిమిషాలు ఉంచి దించెయ్యాలి.అంతే కాకరకాయ పులుసు బెల్లం కూర రెడీ......