రవ్వ కుడుములు
కావలసిన పదార్థాలు
వరినూక(బియ్యం రవ్వ) -- 1కప్పు
శెనగపప్పు -- 2 స్పూన్స్
కొబ్బరితురుము -- 2 స్పూన్స్
జీలకర్ర -- 1/2 స్పూన్
నెయ్యి -- 2 స్పూన్స్
ఉప్పు -- రుచికి తగినంత
తయారీవిధానం
శెనగపప్పుని కడిగి 15 నిముషాలు నానబెట్టి నీళ్ళు వంపేసి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి, ఒక గిన్నెలో నీళ్ళు పోసి, మరిగిన తరవాత ఉప్పు & జీలకర్ర వేసి, రవ్వను వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి. నీరు అంతా ఇంకిపోయి, రవ్వ ఉడికిన తరవాత దించి చల్లారిన తరవాత, కొబ్బరితురుము - నానబెట్టిన శెనగపప్పు - నెయ్యి వేసి, గుండ్రంని ఉండలుగా చేసుకొని, ఇడ్లీ రేకులలో ఉంచి..... స్టవ్ వెలిగించి ఇడ్లీ కుక్కర్ ను సుమారుగా 10 నిముషాలు ఉంచి ఆవిరిపెట్టి, దించుకోవాలి. అంతే వినాయకునికి ఇష్టమైన రవ్వకుడుములు రెడీ.
No comments:
Post a Comment