కొబ్బరి - శెనగపప్పు
కూర
కావలసిన పదార్థాలు
శెనగపప్పు – 2
కప్పులు
కొబ్బరి కోరు(పొడి) – ౪
కప్పులు
పోపుదినుసులు – కొంచెం(మినప్పప్పు,
ఆవాలు, ఎండుమిర్చి, ఇంగువ)
పసుపు – చిటికెడు
ఉప్పు – రుచికి
తగినంత
కారం – 1
స్పూను
వెల్లుల్లి రెబ్బలు – 2
కరివేపాకు – 2
రెబ్బలు
నూనె – 50గ్రా
తయారుచేయు విధానం:-
ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కరులో శెనగపప్పును కొంచెం మెత్తగా ఉడికించుకోవాలి.
ఉడికినపప్పును కుక్కరులోనుండి తీసి, నీరు వంచి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్
వెలిగించి, బాణలిపెట్టి, నూనె వేసి, పోపుదినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు,
వేసి వేగిన తరవాత, కొబ్బరికోరును వేసి, పచ్చిదనం పోయేవరకు వేయించుకోవాలి. ఇప్పుడు
ఈ మిశ్రమంలో ఉడికించి పక్కనపెట్టుకున్న శెనగపప్పును వేసి, ఉప్పు, కారం, పసుపు
అన్నీవేసి, బాగా కలిపి, 5నిముషాలు ఉంచి దించుకోవాలి. అంతే కమ్మని కొబ్బరి - శెనగపప్పు కూర
రెడీ.